పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సుప్రియ

అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు, హీరో సమంత సోదరి అయిన సుప్రియ.. పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు. 22 ఏళ్ల తర్వాత యువ దర్శకుడు శశికాంత్‌ టిక్కా దర్శకత్వంలో తెరకెక్కిన గూఢచారి సినిమాల నటించారు. రీ ఎంట్రీ లోను అందరితో అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో అనేక సంగతులు వెల్లడించారు. “చిరంజీవి తమ్ముడు పవన్ కల్యాణ్ హీరో కావడం వలన .. నాగేశ్వరరావు మనవరాలిగా నేను హీరోయిన్ ను కావడం వలన, ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ సినిమాపై అందరిలోను ఆసక్తి ఉండేది. మా ఇద్దరికీ ఇదే తొలి సినిమా కావడం వలన అంతా కొత్తకొత్తగా ఉండేది” అని తొలి సినిమా అనుభవాలను పంచుకున్నారు.

అలాగే తన హీరో పవన్ గురించి మాట్లాడుతూ.. “పవన్ కల్యాణ్ బాగా సిగ్గరి.. పిలిచి నా పక్కన కూర్చోమన్నా కూర్చునేవాడు కాదు. ఈ సినిమా షూటింగ్ సమయంలో సమ్మె జరిగినప్పుడు అందరి డేట్లు మారిపోతున్నాయి. ఫస్టు మూవీ కావడంతో చాలా టెన్షన్ పడ్డాడు. ఈ సినిమా కోసం ఆయన చాలా కష్టపడ్డాడు. ఆయన చేతుల మీదుగా వరుసగా కార్లు వెళ్లే సీన్ ను డూప్ షాట్స్ గా తీస్తారనుకున్నాను. కానీ పవన్ చేతుల మీదుగా నిజంగానే కార్లు వెళ్లాయి .. అది చూసి నా కళ్ల వెంట నీళ్లొచ్చేశాయి. ఇప్పటికీ పవన్ నాకు మంచి స్నేహితుడు” అని సుప్రియ వెల్లడించారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus