Taapsee: 6 ప్యాక్ తో షాక్ ఇచ్చిన తాప్సీ… వైరల్ అవుతున్న ఫోటోలు!

హీరోయిన్లు సాధారణంగా ఫిట్ గా ఉండడానికి ఎన్నో వర్కౌట్లు చేస్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకే లేచి కఠినమైన యోగాసనాలు వేస్తూ తమ అందాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంటారు. తప్పదు.. వాళ్లకు అవకాశాలు రావాలన్నా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో ఉండాలన్నా… అలాగే ఉండాలి. లేదంటే కష్టం. చాలా మంది భామలు జీరో సైజ్ మెయింటైన్ చేయడానికే అలా చేస్తుంటారు. కానీ తాప్సి మాత్రం అందరికంటే రెండు అడుగులు ముందుకేసి ఏకంగా సిక్స్ ప్యాక్ చేసినట్టు కనిపిస్తుంది.

ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ (Taapsee) చేసింది. కొంతకాలంగా జిమ్ లో పడిన కాష్ఠానికి ఫలితం దక్కింది అంటూ ఆమె కామెంట్ చేసింది. తన జిమ్ ట్రైనర్ తో కలిసి కండలు తిరిగిన దేహంతో బాడీని ఎక్స్ పోజ్ చేసింది తాప్సి. నెటిజన్లు తాప్సీ ని చూసి షాక్ అవుతున్నారు. ‘నువ్వు ఇప్పటికిప్పుడు లేడీ టైగర్ ష్రాఫ్ లా ఎందుకు మారిపోయావు’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేందర్ రావు దర్శకత్వంలో వచ్చిన ‘ఝుమ్మంది నాదం’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తాప్సీ.

అటు తర్వాత ‘వస్తాడు నా రాజు’ ‘వీర’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ ‘దరువు’ ‘మిషన్ ఇంపాసిబల్’ వంటి చిత్రాల్లో నటించింది. కానీ తెలుగులో అంత సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ చెక్కేసింది. అక్కడ హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూ స్టార్ గా ఎదిగింది. ఈ మధ్య కాలంలో యాక్షన్ సన్నివేశాలతో కూడుకున్న సినిమాల్లో కూడా నటిస్తుంది కాబట్టి ఇలా జిమ్ లో కష్టపడి కండలు పెంచినట్టు స్పష్టమవుతుంది.

రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus