Actress: దర్శకుడు కావాలనే నాతో అలాంటి డ్రెస్ వేయించేవారు!

రాఘవేంద్రరావు లాంటి లెజెండ్ డైరెక్షన్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయిని అందుకోలేక పోయింది. మొదటి సినిమా ‘ఝుమ్మంది నాదం’లో బూరెబుగ్గల భామగా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది తాప్సీ పన్ను. అందం, అభినయంతో మంచి నటిగా పేరు తెచ్చుకుని బాలీవుడ్‌లో సైతం తనను తాను నిరూపించుకుంది. అంతేనా, సోషల్‌మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తున్నది. అందం గురించి తనవైన అభిప్రాయాలు చెబుతూ.. నిర్వహణ కాస్త కష్టమే అయినా, ఉంగరాల జుట్టు అంటేనే తనకు ఇష్టమని అంటున్నది ఢిల్లీ భామ తాప్సీ.

ఇది ఇలా ఉంటే గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాప్సి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. కథ డిమాండ్ చేస్తే అందాలను ఆరబోస్తాను అని తాప్సి సమాధానం ఇచ్చింది. నా మొదటి మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. ఆయన కోరినట్లుగానే ఆ సినిమాలో అందాలను ఆరబోశాను. ఆయన గతంలో సీనియర్ స్టార్ హీరోయిన్లతో ఏమి చేయించారో నాతో అదే చేయించారు. కాకపోతే ఆయన ఇచ్చిన కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు నేను నరకం చూసేదాన్ని…

అలాగే ఆ కాస్ట్యూమ్స్ వేసుకున్నప్పుడు చాలా ఇబ్బంది కూడా పడ్డాను. వెరైటీ కాస్ట్యూమ్స్ అన్ని నా చేత వేయించేవారు అంటూ తాప్సి చెప్పుకొచ్చింది. నేను ఏ విషయమైనా మంచిచెడులు తెలుసుకునే మాట్లాడుతా. నా తత్వాన్ని అర్థంచేసుకోలేక.. ముక్కుసూటిగా, పొగరుగా కామెంట్స్‌ చేస్తానని చాలామంది విమర్శిస్తారు. ఆ మాటలు లెక్కచెయ్యను. చెప్పాల్సింది మొహంమీదే చెబుతా. ఎవరికోసమో నా అభిప్రాయాలు మార్చుకోను.

నాకు (Actress) నచ్చినట్టు ఉండటమే నాకు ఇష్టం. ఇదే నా జీవన విధానం. తొలినాళ్లలో కథల ఎంపికలో కాస్త తడబడినా ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచించి సైన్‌ చేస్తున్నా. ఒక సినిమా చేస్తున్నప్పుడు ఆ పాత్ర మనకు నప్పుతుందా లేదా అనేది నిర్ధారించుకున్నాకే, ఓ నిర్ణయం తీసుకోవాలి. సినిమా పూర్తయిన తర్వాత తీరిగ్గా ఆలోచిస్తే ఫలితం తారుమారు అవుతుంది. టాలీవుడ్‌తో పోలిస్తే బాలీవుడ్‌ నాకు సరిపోయే పాత్రలు ఇచ్చింది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus