ఈ వయసులో నాకు కావాల్సింది పెళ్లి కాదు.. ప్రేమ: టబు

మెగాస్టార్ తరం నుండి స్టైలిష్ స్టార్ వరకూ అందరి హీరోలతో నటించి, నటిస్తున్న కథానాయకి టబు. 90ల కాలంలో హాటెస్ట్ హీరోయిన్స్ లో ఒకరైన టబు.. అనంతరం బాలీవుడ్ కి పరిమితమైపోయిన ఈ టాలెంటెడ్ హీరోయిన్ సౌత్ లో చాలా అరుదుగా సినిమాలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా.. “అందరివాడు” అనంతరం టబు తెలుగులో మరో సినిమా చేయలేదు. రీసెంట్ గా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “అంధాధున్” చిత్రంలో టబు నటనకు, ఆమె గ్లామర్ కు ప్రెజంట్ జనరేషన్ ఆడియన్స్ కూడా ఫిదా అయిపోవడంతో.. టబుకి భీభత్సమైన క్రేజ్ పెరిగింది.

ఆ క్రేజ్ పుణ్యమా అనే అల్లు అర్జున్-త్రివిక్రమ్ ల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రమైన “అల వైకుంఠపురములో” చిత్రంలో మదర్ రోల్ కోసం ఆమెను తీసుకొన్నారు. ఆ క్రమంలో హైద్రాబాద్ కి వచ్చిన టబు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇప్పటికీ ఆమెను ఇబ్బందిపెడుతున్న ప్రశ్న ఏమిటి అని అడిగినప్పుడు సమాధానంగా.. “ఇప్పటికీ చాలా మంది నా పెళ్లి ఎప్పుడు అని అడుగుతుంటారు. అసలు ఈ వయసులో నాకు పెళ్లి అవసరం ఉందా. నాకు కావాల్సిందల్లా ప్రేమ. అది నాకు ఏదో ఒక రూపంలో దొరుకుతూనే ఉంది. నావరకు నాకు సినిమాలే జీవితం. సుఖంగా సినిమాలు చేసుకొంటున్నాను.. పెళ్లి అనే విషయం గురించి ఆలోచించను కూడా” అని క్లారిటీ ఇచ్చింది. అయినా.. 48 ఏళ్ల వయసులో టబుని పెళ్లి గురించి అడగడం కూడా సబబు కాదు.

1

2

3

4

5

6

7

8

9

10

తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus