Actress Tabu: పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వొచ్చు.. పెళ్లి అవసరమే లేదు: టబు

టాలీవుడ్లో పెళ్లి వయసు వచ్చి వెళ్ళిపోయినా కూడా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. అందులో సీనియర్ స్టార్ హీరోయిన్ టబు ఒకరు. తెలుగు, హిందీ సినీ పరిశ్రమలని తన గ్లామర్ తో ఓ ఊపు ఊపేసిన టబు ఇప్పటికీ బిజీ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది.హిందీలో ఆమె వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది. మొన్నామధ్య ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించింది.

ఇదిలా ఉండగా.. 50 ఏళ్ల వయసు వచ్చినా ఈమె ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ ఇప్పటికీ ఆమె రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూనే ఉంది. ‘ఎ సూటబుల్ బాయ్’ లో ఈమె వేశ్య పాత్రలో చేసిన గ్లామర్ షో అంతా ఇంతా కాదు. ఇదిలా మొన్నటికి మొన్న ఓ చిత్రం షూటింగ్లో గాయపడిన టబు త్వరగానే కోలుకొని షూటింగ్లో పాల్గొంటుంది. ఇదిలా ఉండగా… ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న టబు.. పెళ్లి చేసుకోకుండా తల్లి కావాలని ఆశపడుతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. “అందరిలానే నాకు కూడా తల్లి కావాలని ఉంది. అందుకు పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్ళి కాకుండానే గర్భం దాల్చవచ్చు. సరోగసి ద్వారా కూడా తల్లయ్యే అవకాశం అందరికీ ఉంది. నాకు తల్లి కావాలి అనిపిస్తే ఆ పద్ధతిని అనుసరిస్తాను.పెళ్ళి కాకపోతే చచ్చిపోం, తల్లి కాకపోయినా చచ్చిపోం..! ప్రస్తుతం కెరీర్‌ని, యాక్టింగ్ ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాను.

పెళ్ళికి, పిల్లలకు వయసుతో సంబంధం లేదు. అయినా ఈ రోజుల్లో దేనికీ కూడా వయసుతో సంబంధం లేదు” అంటూ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.టబు కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ‘నిజంగానే ఆమె పెళ్లి చేసుకోకుండా సరోగసి ద్వారా తల్లి అవుతుందా’ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus