Tabu: ఆ స్టార్ డైరెక్టర్ సినిమాతో టాలీవుడ్ కి మళ్ళీ రీ- ఎంట్రీ ఇస్తున్న టబు!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు ని (Tabu) తెలుగు ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. వెంకటేష్ (Venkatesh)  హీరోగా కె.రాఘవేంద్రరావు (Raghavendra Rao) దర్శకత్వంలో రూపొందిన ‘కూలీ నెంబర్ 1’ (Coolie No. 1) సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత నాగార్జునతో (Nagarjuna) ‘నిన్నే పెళ్ళాడతా’ (Ninne Pelladata) ‘ఆవిడా మా ఆవిడే’ (Aavida Maa Aavide) వంటి సినిమాల్లో నటించి మెప్పించింది. తర్వాత బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘చెన్నకేశవరెడ్డి’ (Chennakesava Reddy) ‘పాండురంగడు’ (Pandurangadu) , చిరంజీవి  (Chiranjeevi) ‘అందరివాడు’ (Andarivaadu) వంటి సినిమాల్లో కూడా నటించింది.తర్వాత ఈమె తెలుగు సినిమాల్లో ఎక్కువగా నటించింది లేదు.

Tabu

ఎక్కువగా బాలీవుడ్లోనే సినిమాలు చేస్తూ వస్తోంది. దీనిపై ఆమెను గతంలో ప్రశ్నిస్తే.. హిందీలో నాన్ స్టాప్ గా బిజీగా ఉండటం వల్ల తెలుగులో సినిమాలు చేయలేకపోతున్నట్టు తెలిపింది. కుదిరినప్పుడు తెలుగు సినిమాల్లో నటిస్తూ ఉంది. 2008లో వచ్చిన ‘పాండురంగడు’ తర్వాత మళ్ళీ ఈమె తెలుగులో చేసింది 2020 లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo)  సినిమాలో..! ఆ తర్వాత మళ్ళీ ఆమె తెలుగు సినిమాలో నటించింది లేదు.

అయితే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ టబు రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం. అవును.. అసలు మేటర్లోకి వెళ్తే పూరి జగన్నాథ్ (Puri Jagannadh)  దర్శకత్వంలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) హీరోగా ఒక సినిమా తెరకెక్కనుంది. దీన్ని కూడా పూరీ, ఛార్మి (Charmy Kaur)  కలిసి నిర్మిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమాలో అతి కీలకమైన పాత్ర కోసం టబుని సంప్రదించారట పూరీ. ఆమె కూడా పాత్ర నచ్చడంతో చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.

అల్లు అర్జున్ – అట్లీ.. పెద్ద ప్లానే ఇది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags