Tamannaah: ఆ సమయంలో నా కెరియర్ ముగిసిందనుకున్నాను… తమన్నా కామెంట్స్ వైరల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు రెండు దశాబ్దాలు కావస్తోంది. గత రెండు రోజుల క్రితం ఈమె పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో ఈమె ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతున్న సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ తాను ముంబైలో ప్లస్ 2 చదివే సమయంలోనే ఇండస్ట్రీలోకి వచ్చానని తెలిపారు.

ఈ విధంగా తాను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో తన వయసు కేవలం 15 సంవత్సరాలు మాత్రమేనని తమన్నా తెలిపారు. ఇక తాను మొదటిగా నటించిన చిత్రం సాంద్ సా రోషన్ షహానా అని హిందీ సినిమాలో నటించినట్లు ఈమె పేర్కొన్నారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయిందని అలాగే అదే ఏడాదిలో తెలుగులో శ్రీ అనే సినిమాలో కూడా నటించానని తమన్నా తెలిపారు.ఇలా ఒకే ఏడాది తాను నటించిన రెండు సినిమాలు ఫ్లాప్ అవడంతో ఇక నా కెరియర్ ఇంతటితో ముగుస్తుందని చాలా భయపడ్డాను.

ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించిన హ్యాపీ డేస్ సినిమాలో అవకాశం రావడం ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో తనకు వరుసగా తెలుగు తమిళ భాషలలో అవకాశాలు వచ్చాయని ఈమె తెలిపారు. ఇలా పలు భాషా చిత్రాలలో అగ్ర హీరోలందరి సరసన నటించడమే కాకుండా స్పెషల్ సాంగ్స్ లో చేసే అవకాశం కూడా వచ్చిందని తమన్న వెల్లడించారు.

ఇకపోతే తన సినీ కెరియర్ లో ఇంకా మంచి మంచి పాత్రలలో నటించి ప్రేక్షకులను సంతోషపరచడమే తన కోరిక అంటూ ఈ సందర్భంగా ఈమె తన సినీ కెరియర్ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus