Tripti Dimri: అలాంటి రోల్స్ కావాలని కోరుకుంటున్న త్రిప్తి.. ఏమైందంటే?

యానిమల్ సినిమా ద్వారా ఓవర్ నైట్ లో పాపులర్ అయిన త్రిప్తి డిమ్రి ప్రస్తుతం వరుసగా క్రేజీ సినిమాలలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగులో సైతం ఈ బ్యూటీకి చెప్పుకోదగ్గ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. తనకు సవాళ్లతో కూడిన రోల్స్ అంటే ఇష్టమని త్రిప్తి డిమ్రి చెబుతున్నారు. ఓటీటీలలో నటించడానికి తానెప్పుడూ సిద్ధమేనని ఆమె కామెంట్లు చేశారు. తన కెరీర్ లో డిజిటల్ మీడియా కీ రోల్ పోషించిందని ఆమె చెప్పుకొచ్చారు.

యానిమల్ మూవీ కంటే ముందే నాపై ఎంతోమంది అభిమానం చూపించారంటే కారణం ఓటీటీలే అని త్రిప్తి తెలిపారు. టాలెంట్ ఉన్నా ఆఫర్లు దొరక్క గతంలో కొంతమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారని త్రిప్తి చెప్పుకొచ్చారు. ఓటీటీ వేదికగా ఎంతోమంది టాలెంట్ ను ప్రదర్శిస్తున్నారని ఆమె కామెంట్లు చేశారు. ఓటీటీల వల్ల చాలామందికి గుర్తింపు వచ్చిందని త్రిప్తి అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.

నాకు సవాళ్లతో కూడిన రోల్స్ అంటే ఇష్టమని అది థియేటర్ మూవీనా ఓటీటీ మూవీనా అని నేను ఆలోచించనని ఆమె పేర్కొన్నారు. నాకిచ్చిన రోల్ కు నూటికి నూరు శాతం న్యాయం చేశానా లేదా అనేది నా లక్ష్యమని త్రిప్తి చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలని నేను భావిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఆషికి3 సినిమాలో ఛాన్స్ దక్కిందని అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని త్రిప్తి వెల్లడించారు.

తాను కూడా ఆ సినిమాలో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్నానని త్రిప్తి అన్నారు. తెలుగులో త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తుండగా ఆ ఆఫర్లతో ఆమె క్రేజ్ ను పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లో త్రిప్తి కెరీర్ పరంగా మరింత సత్తా చాటడంతో పాటు మరిన్ని విజయాలను అందుకుంటారని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. త్రిప్తిని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. త్రిప్తి (Tripti Dimri) రెమ్యునరేషన్ సైతం అంతకంతకూ పెరుగుతోందని తెలుస్తోంది.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus