Trisha: ఆ విషయంలో త్రిష, కీర్తి సేమ్ టు సేమ్..?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపును సంపాదించుకున్న త్రిష నేడు 38వ పుట్టినరోజును జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా త్రిష నటించిన పరంభద అనే సినిమా ఓటీటీలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం హీరోను బట్టి, కథను బట్టి త్రిష ఒక్కో సినిమాకు కోటి రూపాయల నుంచి రెండున్నర కోట్ల రూపాయల మధ్యలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఈ హీరోయిన్ తొలి సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో నటించినందుకు 500 రూపాయలు రెమ్యునరేషన్ గా తీసుకున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం 500 రూపాయలు అంటే తక్కువ మొత్తం అయినా 20 సంవత్సరాల క్రితం 500 రూపాయలు అంటే ఎక్కువ మొత్తమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం తెలుగులో పెద్దగా ఆఫర్లు లేని ఈ హీరోయిన్ కు తమిళంలో మాత్రం భారీగా ఆఫర్లు ఉండటం గమనార్హం. స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ సైతం ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఊహ తెలిసిన తర్వాత తన తొలి సంపాదన 500 రూపాయలు అని చెప్పుకొచ్చారు. కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసే సమయంలో షోలలో పాల్గొన్నానని ఆ సమయంలో 500 రూపాయలు పారితోషికంగా తీసుకున్నానని కీర్తి సురేష్ తెలిపారు.

ప్రస్తుతం కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఈ హీరోయిన్లు ఒకప్పుడు వందల్లో రెమ్యునరేషన్ తీసుకోవడం కీర్తి, త్రిషల తొలి సంపాదన రూ.500 కావడం గమనార్హం. ప్రస్తుతం కీర్తి సురేష్ మహేష్ కు జోడీగా సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ మూవీ రిలీజ్ కానుంది.

Most Recommended Video

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus