టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న హీరోయిన్లలో త్రిష ఒకరు. గతంలో పోలిస్తే త్రిషకు తెలుగులో సినిమా ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే. అయితే ఆఫర్లు తగ్గినా త్రిష మాత్రం కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించారనే సంగతి తెలిసిందే. అయితే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రతి ఒక్కరూ పాలిటిక్స్ లో సక్సెస్ అవుతారని చెప్పలేము.
ప్రముఖ జాతీయ పార్టీలలో ఒకటైన కాంగ్రెస్ పై త్రిష దృష్టి పెట్టారని బోగట్టా. విజయ్ సేతుపతి సూచనల మేరకు రాజకీయాలపై త్రిష అసక్తిని పెంచుకున్నారని సమాచారం అందుతోంది. త్రిష కీలక పాత్రలో నటించిన పొన్నియన్ సెల్వన్ సినిమా త్వరలో రిలీజ్ కానుంది. మరోవైపు ఈ స్టార్ హీరోయిన్ కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల మంచి భవిష్యత్తు ఉంటుందని ఆమె భావిస్తున్నారని బోగట్టా.
త్రిష అభిమానులు సైతం ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. సినిమాలలో రెండు దశాబ్దాల పాటు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన త్రిష సరైన నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకుని పోటీ చేస్తే ఆమె ఎన్నికల్లో విజయం సాధించడం కష్టమేమీ కాదు. అయితే సెలబ్రిటీలలో చాలామందికి ఈ మధ్య కాలంలో రాజకీయాలు పెద్దగా కలిసిరావడం లేదనే సంగతి తెలిసిందే. ప్రముఖ పార్టీల నుంచి సెలబ్రిటీలు పోటీ చేసినా మెజారిటీ సందర్భాలలో షాకులు తగులుతున్నాయి.
త్రిష కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాజకీయ విశ్లేషకుల సలహాలు, సూచనలు తీసుకొని ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే సినిమాలకు దూరం కావాల్సి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.