ఎంత పెద్ద సూపర్ స్టార్ కి అయినా బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ లోకి వస్తే ప్రారంభం లో ఘోరమైన అవమానాలు తప్పవు. అలాంటి అవమానాలను స్వీకరించి వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు నేడు ఇండస్ట్రీ లో తిరుగులేని స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. దశాబ్దాల తరబడి చిత్రపరిశ్రమని నెంబర్ 1 స్థానం లో కూర్చొని ఏలుతున్నారు. అలాంటి వారిలో ఒకరు మన మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మందికి స్వయంకృషి తో పైకి రావాలని ఆదర్శంగా నిల్చిన గొప్ప వ్యక్తి ఆయన.
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా వచ్చిన ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవమానాలను ఎదురుకున్నాడు. ఆయన హీరో గా రెండు మూడు హిట్లు కొట్టిన తర్వాత కూడా దర్శక నిర్మాతలు కృష్ణ , శోభన్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ రోల్స్ అవకాశం ఇస్తే, ఇష్టం లేకపోయినా కూడా చెయ్యాల్సి వచ్చింది అని రీసెంట్ గా జరిగిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇకపోతే రీసెంట్ గా ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ (Tulasi) తులసి అప్పట్లో చిరంజీవి ని ప్రముఖ దర్శకుడు/ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పెట్టిన టార్చర్ గురించి చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘ఆరోజుల్లో చిరంజీవి , వాసు కాంబినేషన్ లో తమ్మారెడ్డి భరద్వాజ తెరకెక్కించిన ‘కోతల రాయుడు’ అనే సినిమాలో నేను ఒక చిన్న పాత్రని పోషించాను. ఈ సినిమా 1979 వ సంవత్సరం లో విడుదలై పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. అయితే ఈ చిత్రం షూటింగ్ సమయం లో ఒకరోజు చిరంజీవి షూటింగ్ కి కాస్త ఆలస్యం గా వచ్చాడు.
దీనితో ఆ చిత్ర నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కి చాలా కోపం వచ్చేసింది. ఆలస్యం గా వచ్చినందుకు గాను శిక్షగా రోజు మొత్తం ఎండలో నిలబడాలని ఆదేశించాడు. చిరంజీవి ఆ శిక్ష ని మనస్ఫూర్తిగా స్వీకరించి రోజు మొత్తం ఎండలో నిలబడ్డాడు, రీసెంట్ గా కలిసినప్పుడు ఈ సంఘటన గుర్తు చేసుకోని నేను చిరంజీవి గారు నవ్వుకున్నాం’ అంటూ చెప్పుకొచ్చింది తులసి. ఈమె రీసెంట్ గా విడుదలైన చిరంజీవి ‘భోళా శంకర్’ చిత్రం లో ఒక ముఖ్యమైన పాత్ర పోషించిన సంగతి అందరికీ తెలిసిందే.