సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ప్రేమించుకుని పెళ్లిళ్లు చేసుకోవడం విడిపోవడం సర్వసాధారణంగా జరుగుతుంది. అయితే ఎంతమంది జీవితంలో మోసపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత స్వతంత్రంగా బతకడం కోసం కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతూ ఉంటారు అలాంటి వారిలో ఊర్వశి ఢోలకియా ఒకరు. ఈమె చిన్నప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు అలాగే సీరియల్స్ లో కూడా నటించారు. ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి ఈమే తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల గురించి తెలియజేశారు.
తాను నటి కావాలని కలలో కూడా అనుకోలేదు నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలని పెళ్లి తర్వాత ఎలాంటి పనులు చేయకూడదని ఎన్నో కలలు కన్నాను. పెళ్లి తర్వాత నేను ఒక మహారాణిల బ్రతకాలి అనుకున్నాను కానీ నా జీవితం మొత్తం తలకిందులుగా మారిందని తెలిపారు. 16 సంవత్సరాల వయసులో నా తల్లి నాకు ఒక విషయం చెప్పింది నువ్వు స్వతంత్రంగా బతకడం నేర్చుకో కానీ పెళ్లి చేసుకోవాలనే చెప్పారు.
దీంతో నాకు 17 సంవత్సరాల వయసులోనే పెళ్లి చేశారు. 18 ఏళ్లకు కవల పిల్లలు జన్మించారు అయితే నా భర్తతో మనస్పర్ధలు రావడంతో 18 ఏళ్లకే విడాకులు తీసుకుని విడిపోయాను. నేను విడాకులు తీసుకోవడానికి నా భర్త బాధ్యతగా లేకపోవడమే కారణమని ఈమె తెలిపారు. ఇక తాను తన పిల్లల్ని వదిలేసినట్టు నేను నా పిల్లలను వదిలేయలేను కదా అందుకే వారి కోసమే తిరిగి కెమెరా ముందుకు రావాల్సి వచ్చిందని ఈమె తెలియజేసారు.
అయితే నా పరిస్థితిని చూసి కొంతమంది నిర్మాతలు అడ్వాంటేజ్ గా తీసుకొని నాకు తక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ ఇచ్చే వాళ్లంటూ ఈమె తన వ్యక్తిగత జీవితంలో వచ్చినటువంటి ఒడిదుడుకుల గురించి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత నా పిల్లలు ఎప్పుడైనా తన (Urvashi Dholakia) తండ్రి గురించి వారికి చెబుదాము అంటే తనని అసలు చెప్పనివ్వరని ఈమె తెలిపారు.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!