Bandla Ganesh : టాలీవుడ్ నిర్మాతలలో బండ్ల గణేష్ కి ఒక సెపెరేట్ క్రేజ్ ఉంది. ఎక్కడైనా హీరోలకు, ఆర్టిస్టులకు క్రేజ్ ఉంటుంది కానీ ఒక నిర్మాతకి ఇలా ఉండటం చాలా అరుదు. అయితే దానికి కారణం బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ పై చూపించే అభిమానం అనే సంగతి అందరికి తెల్సిన విషయమే.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘తీన్మార్’ చిత్రం నిర్మాణంతో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన బండ్ల గణేష్. అంతకు ముందు చాలా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. అయితే తీన్మార్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా కూడా పవర్ స్టార్ కేరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయిన ‘గబ్బర్ సింగ్’ చిత్రం ద్వారా బండ్ల గణేష్ ఒక్కసారిగా బడా నిర్మాతగా మారిపోయాడు. ఆ తరువాత తెలుగులో వరుస సినిమాలు నిర్మించటం మంచి హిట్లు కొట్టడం జరిగింది.

అయితే బండ్ల గణేష్ మాత్రం తనకు నిర్మాతగా అవకాశం ఇచ్చి, తన జీవితాన్ని మార్చేసిన పవన్ కళ్యాణ్ ని మాత్రం దేవుడి గా వర్ణిస్తుంటారు. చాలా సందర్భాలలో సినిమా ఈవెంట్ల వేదికలపై బండ్ల గణేష్ తన అభిమానాన్ని చాటుతూ చేసే వ్యాఖ్యలు వైరల్ గా మారటం అందరికి తెల్సిన విషయమే. అయితే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన చివరి చిత్రమైన ‘OG’ దర్శకుడు సుజీత్ కి ఖరీదైన కార్ గిఫ్ట్ ఇవ్వటం జరిగింది. దానికి సంబందించిన ఫోటోలు దర్శకుడు సుజీత్ ‘X’ వేదికగా షేర్ చేయగా అవి నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఆ పోస్ట్ కి రిప్లై ఇస్తూ బండ్ల గణేష్ “ఆయన నీకు కార్ మాత్రమే ఇచ్చారు. నాకు జీవితమే ఇచ్చారు” అంటూ తన అభిమానాన్ని మళ్లి చాటుకున్నారు. ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ ను మెచ్చుకుంటున్నారు.
