పవన్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన యమున!

1990 దశకంలో మామగారు.. ఎర్రమందారం.. మౌన పోరాటం వంటి చిత్రాలతో హీరోయిన్ యమున మంచి పేరు తెచ్చుకుంది. పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరమైనా ఈ నటి.. ఈటీవీలో సీరియల్స్ ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. తాజాగా ఓ వెబ్‌ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనేక ఆసక్తికర సంగతులను చెప్పింది. ఇప్పటి హీరోల్లో మీకు ఎవరి నటన బాగా ఇష్టం ? అనే ప్రశ్నకు ఆమె సమాధానమిస్తూ.. “ఒక్కరని కాదు. ఒక్కో సినిమాలో ఒక్కొక్కరి నటన నచ్చుతుంది. ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో పవన్ నటన నన్ను బాగా ఆకట్టుకుంది’ అని వెల్లడించింది. అంతేకాదు పవన్ తో తనకున్న పరిచయాన్ని గుర్తుచేసుకుంది. “ఓ సారి న్యూ ఇయర్ సందర్బంగా చిరంజీవిని కలసి విషెస్ చెబుదామని  ఆయన ఇంటికి వెళ్ళాను.

ఆ సమయంలో ఆయన ఇంట్లో లేరు. గుడికి వెళ్ళారంట. అప్పుడే పవన్‌కళ్యాణ్‌ని మొదటిసారి చూశాను. అప్పటికింకా ఆయన సినిమాల్లో అడుగుపెట్టలేదు. అయితే నన్ను చూసిన పవన్ ఎంతో ఆప్యాయంగా పలకరించి.. “కాసేపట్లో అన్నయ్య వచ్చేస్తాడు.. కూర్చోండి” అంటూ ఆహ్వానించాడు. కొద్దిసేపటిలోనే చిరు వచ్చేశారు. వెంటనే పవన్‌కి, చిరుకి స్వీట్స్ ఇచ్చి విషెస్ చెప్పి తిరిగివెళ్ళాను. ఇప్పటికీ ఆ సంఘటన నాకు అలా గుర్తుండిపోయింది” అని యమున గుర్తు చేసుకుంది. ఆడవారితో పవన్ ఎంతో గౌరవంగా నడుచుకుంటారని స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus