తమిళ సినిమా కోసం సింగర్ గా మారిన హార్ట్ ఎటాక్ బ్యూటీ

కథానాయికగా పరిచయమైన తొలి చిత్రం “1920” అనే హిందీ చిత్రంతోనే నటిగా తన స్టామినాను పూర్తి స్థాయిలో ప్రూవ్ చేసుకొన్న అదా శర్మ, ఆ తర్వాత తెలుగులోనూ “హార్ట్ ఎటాక్”లో పర్ఫెక్ట్ లిప్ సింక్, హావభావాలతో ఆకట్టుకొంది. “క్షణం” తర్వాత ఎక్కువ సినిమాల్లో సెకండ్ లీడ్ లేదా గెస్ట్ అప్పీరియన్స్ లు చేసేయడం వల్ల ఈ అమ్మడిని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు కానీ.. అందం, అభినయం పుష్కలంగా ఉన్న కంప్లీట్ ఆర్టిస్ట్ అదా శర్మ. ప్రస్తుతం తెలుగులో సరైన ఆఫర్లు లేకపోవడంతో కొన్నాళ్లపాటు ఒక డ్యాన్స్ షోకి హోస్ట్ గానూ వ్యవహరించిన అదా శర్మ టాలెంట్ ను ఎట్టకేలకు తమిళ పరిశ్రమ గుర్తించి మంచి ఆఫర్ ఇచ్చింది.

ప్రభుదేవా ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న “చార్లీ చాప్లిన్ 2” అనే సినిమాలో కథానాయికగా నటించే అవకాశం సొంతం చేసుకొంది. మొదట కేవలం కథానాయికగా అమ్మడి చేత సైన్ చేయించుకొన్న చిత్రబృందం.. అనంతరం ఆమె చేత పాట కూడా పాడించిందట. అందుకు కారణం లేకపోలేదు. సినిమా సెట్స్ లో ఉన్నప్పుడు ఒకసారి అదా తన ఇన్స్టాగ్రామ్ లో లైవ్ చాట్ చేస్తూ ఒక అభిమాని కోసం “చార్లీ చాప్లిన్ 2″లోని ఒక పాట పాడిందట. ఆ పాట విన్న చిత్రబృందం సినిమాలోనూ ఆమె చేతే పాడించాలని ఫిక్స్ అయ్యారట. సొ, “చార్లీ చాప్లిన్ 2″లో అదా శర్మ నటన చూడడం మాత్రమే కాకుండా, ఆమె గొంతు కూడా వినొచ్చన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus