ఆర్.ఆర్.ఆర్ కి నేను టికెట్స్ బుక్ చేసుకుంటే.. సాయంత్రానికి నా సినిమా అదే రోజు రిలీజ్ అన్నారు

ఆది సాయి కుమార్ హీరోగా నటించిన అతిథి దేవోభవ’ జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. ప్రమోషన్లలో భాగంగా ఈరోజు హీరో ఆది చిత్రం గురించి ప‌లు విష‌యాలు మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలను ఓ లుక్కేద్దాం రండి :

ప్ర. మీ 10 ఏళ్ళ కెరీర్లో మొదటి సారి సంక్రాంతి బరిలో దిగుతున్నారు.. ఎలా అనిపిస్తుంది?

జ. సినిమా అయితే రెడీ చేసి పెట్టుకున్నాం. డిసెంబర్లో మంచి డేట్ కోసం చూసాం. కానీ దొరకలేదు. అనుకోకుండా ఇప్పుడు ‘ఆర్.ఆర్.ఆర్’ పోస్ట్ పోన్ అయ్యింది. దాంతో వెంటనే జనవరి 7కి రిలీజ్ చేసేయ్యాలని డిసైడ్ అయ్యాము.

ప్ర. సంక్రాంతి మీకు ఎంతవరకు ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు?

జ.సినిమా బాగుండి, లక్ ఫ్యాక్టర్ అనేది కలిసొచ్చి,ఇంకా కొన్ని సినిమాలు వస్తున్నాయి కాబట్టి మా సినిమా థియేటర్లు కూడా హోల్డ్ చేయగలిగితే తప్పకుండా నేను బయటపడిపోతాను అని అనుకుంటున్నాను(నవ్వుతూ)

ప్ర.మీ సినిమాలకి నాన్నగారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు కచ్చితంగా హిట్టు కొట్టాల్సిన టైం కదా..!

జ. డాడీ కథలు వింటారండీ అంతే..! ఫైనల్ డెసిషన్ నాదే. ‘అతిథిదేవోభవ’ కథ అయితే ఆయన వినలేదు.ఆయనకి లైన్ మాత్రమే తెలుసు.

ప్ర. నిర్మాతలు తీసుకున్న డెసిషనా ఇది?

జ.నిర్మాతలకి ముందుగా నేను థాంక్స్ చెప్పుకోవాలి. ఆదివారం నాడు వాళ్ళు చాలా ఫాస్ట్ గా డెసిషన్ తీసుకున్నారు. మంచి డేట్ దొరికింది. కచ్చితంగా సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారు అనే నమ్మకంతో జనవరి 7కి వచ్చేస్తున్నాం.

ప్ర.మీ గత సినిమాలతో పోలిస్తే ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?

జ. నా గత చిత్రా హీరోయిజం అది ఉంటుంది.. కానీ ఈ చిత్రంలో నా పాత్ర చాలా సెటిల్డ్ గా ఉంటుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధంగా నా పాత్ర ఉంటుంది.

ప్ర.అసలు ‘అతిథిదేవోభవ’ అనే టైటిల్ ఎలా ఫిక్స్ చేశారు?

జ.హీరోకి ఓ ఫోబియా ఉంటుంది. అతనికి ఒంటరిగా ఉండడానికి భయం.అందుకోసం ఆ టైములో ఎవరు వచ్చినా వాళ్ళని అతిథిలా భావించి ట్రీట్ చేస్తూ ఉంటాడు.అందుకే ‘అతిథిదేవోభవ’ అని పెట్టాం.ఇది ఇప్పటివరకు హైడ్ చేసాం. టీజర్ చూసి అంతా ఇదో హార్రర్ మూవీ అనుకుంటున్నారు. కానీ కాదు ఇందులో మంచి మదర్ సెంటిమెంట్ ఉంటుంది. రోహిణి గారు ఇందులో నా తల్లి పాత్ర పోషించారు.ఒక్క రోజులో జరిగే కథ ఇది. కొంచెం ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంటుంది మళ్ళీ ప్రెజెంట్ కి వస్తుంటుంది. ఒక్కరోజులో హీరోకి అనుకోని పరిస్థితులు ఎదురైతే అతను ఎలా బయటపడ్డాడు అనేది ఈ చిత్రం మెయిన్ థీమ్. ఈరోజు ట్రైలర్ రిలీజ్ అవుతుంది. దాంతో మీకు మరింత క్లారిటీ వస్తుంది.

ప్ర.నిజ జీవితంలో కూడా మీరు ఒంటరిగా ఉండడానికి భయపడతారా?

జ.లేదండీ.. చాలా మంది ఒంటరిగా ఉండడానికి భయం అంటారు కానీ.. నాకైతే భయమేమీ ఉండదు. నిజానికి నాకు ఒంటరిగా ఉండడం ఇష్టం. అలాంటి టైం కూడా ఇప్పుడు దొరకడం కష్టం. ఒంటరిగా ఉంటే హ్యాపీగా సినిమాలు చూసుకుంటూ బుక్స్ చదువుతూ గడిపేస్తాను.

ప్ర. మీరు రిజెక్ట్ చేసి బాధపడిన సినిమాలు ఉన్నాయి.?

జ. రిజెక్ట్ చేసినవి ఉన్నాయి. వాటి పేర్లు చెప్పడం ఇష్టం లేదు. అందులో కొన్ని హిట్ అయ్యాయి. చాలా వరకు ప్లాప్ అయ్యాయి కూడా ..!

ప్ర.’నెక్స్ట్ నువ్వే’ చిత్రానికి ఈ చిత్రానికి పోలికలు ఉన్నాయా?

జ.లేదండీ.. దానికి.. దీనికి అస్సలు సంబంధం లేదు. ట్రైలర్ చూస్తే మీకు అర్ధమవుతుంది.

ప్ర.హీరోయిన్ నువేక్ష ఎలా చేసింది?

జ. ఆ అమ్మాయి చాలా బాగా చేసింది. యూత్ కు ఆమె బాగా కనెక్ట్ అవుతుంది. ‘సెబాస్టియన్’ మూవీలో కూడా ఆమె చేస్తుంది.

ప్ర.సంగీతం ఈ చిత్రానికి ఎంత ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు?

జ. ‘బాగుంటుంది నువ్వు నవ్వితే’ అనే పాట సూపర్ హిట్ అయ్యింది. ఇంకో పాట కూడా చాలా బాగుంటుంది. శేఖర్ చంద్ర గారు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు మాకు.

జ.ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాను. ‘తీస్ మార్ ఖాన్’ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ‘నాటకం’ ఫేమ్ ఈ చిత్రానికి దర్శకుడు. ‘బ్లాక్’ అనే థ్రిల్లర్ మూవీ ఒకటి.’అమరన్ ఇన్ ది సిటీ’ అనే ఒక మూవీ. ‘జెంటిల్’ అనే డెబ్యూ మూవీ ఒకటి. జనవరి 14నుండీ రాధా మోహన్ గారి దర్శకత్వంలో ‘ఫన్నీ కృష్ణ’ అనే మూవీ ఒకటి చేస్తున్నాను. ‘సి.ఎస్.ఎస్.సనాధన’ అనే మూవీ ఒకటి.

ప్ర. మీ గత సినిమాలు అనుకున్న ఫలితాల్ని ఇవ్వలేదు.? ఈసారి ఎలా ఫలితం ఎలా ఉంటుంది అనుకుంటున్నారు?

జ. ఈ మధ్య కాలంలో నా సినిమాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. కొన్ని సినిమాలకి రిలీజ్ డేట్లు కలిసిరాలేదు. మరికొన్ని మంచి డేట్లలో రిలీజ్ అయ్యాయి. ‘చుట్టాలబ్బాయి’ ‘రఫ్’ అనే చిత్రాలు మంచి డేట్లలో రిలీజ్ అవ్వడం వల్ల వాటికి రెవిన్యూ పరంగా ప్లస్ అయ్యాయి.కానీ రివ్యూలు బాగా రాలేదు కాబట్టి అవి నిలబడలేదు. ఈసారి మాత్రం మంచి డేట్ దొరికింది.. సినిమా కూడా బాగా వచ్చింది. మంచి సినిమా పడితే మళ్ళీ జనాలు ఓన్ చేసుకుంటారు అనేది నా నమ్మకం.

ప్ర. ఆర్.ఆర్.ఆర్ డేట్ కి మీ సినిమా వస్తుంది ఎలా ఫీల్ అవుతున్నారు?

జ. జనవరి 8 కి ఆర్.ఆర్.ఆర్ టికెట్స్ బుక్ చేసుకున్నాను. కానీ ఆ సినిమా వాయిదా పడింది అని తెలిసి డిజప్పాయిట్ అయ్యాను. కానీ తర్వాత నా సినిమా రిలీజ్ అవుతుంది అదే డేట్ కి అన్నారు. దాంతో నాలో కొత్త ఉత్సాహం నెలకొంది.

ప్ర. కరోనా మళ్ళీ విజృంభిస్తోంది.మీ సినిమా విడుదలకి ఇబ్బంది ఎదురవుతుంది అని మీరు భావిస్తున్నారా?

జ. రోజురోజుకీ సిట్యుయేషన్ బ్యాలన్స్ తప్పుతుంది.మనం ఇందులో ఏమీ చేసేది ఉండదు కదా. బట్ నా సినిమా హిట్ అయితే రెండో శనివారం కలిసి వస్తుంది. దాంతో బుకింగ్స్ బాగుంటాయి అనుకుంటున్నా..!

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus