Adhurs: అదుర్స్ అనిపిస్తున్న అదుర్స్ రీ రిలీజ్ ట్రైలర్.. రికార్డులు బ్రేక్ అవుతాయా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు రీ రిలీజ్ లో రికార్డులు క్రియేట్ చేయగా సింహాద్రి సినిమా రీ రిలీజ్ లో భారీ స్థాయిలో కలెక్షన్లను సాధించింది. అయితే సింహాద్రి రీరిలీజ్ కలెక్షన్లను అదుర్స్ సినిమా బ్రేక్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదుర్స్ రీ రిలీజ్ ట్రైలర్ తాజాగా రిలీజ్ కాగా ఈ ట్రైలర్ కు భారీ స్థాయిలోనే వ్యూస్ వస్తుండటం గమనార్హం. అదుర్స్ రీ రిలీజ్ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉండగా ఎన్ని థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్ అవుతుందో చూడాలి.

2010 సంవత్సరంలో విడుదలైన అదుర్స్ మూవీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ సినిమాలోని కామెడీ సీన్లు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషించి సక్సెస్ సాధించిన అతికొద్ది సినిమాలలో అదుర్స్ కూడా ఒకటి కాగా షీలా, నయనతార ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో నయన్ పోషించిన చంద్రకళ రోల్, బ్రహ్మానందం పోషించిన భట్టు పాత్రలను ప్రేక్షకులు మరిచిపోలేరు.

ఈ జోడీకి సంబంధించిన మీమ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అదుర్స్ మూవీ రీ రిలీజ్ లో భారీ స్థాయిలో లాభాలను అందించిన సినిమాలలో ఒకటిగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ప్రస్తుతం థియేటర్లలో ప్రదర్శితమవుతున్న సినిమాల్లో పొలిమేర2 మినహా మరే సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు. అందువల్ల అదుర్స్ రీ రిలీజ్ కు మంచి రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.

అదుర్స్ (Adhurs) రీ రిలీజ్ కోసం భారీ స్థాయిలో ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. అదుర్స్ సినిమా రీ రిలీజ్ కు విశ్వక్ సేన్ తన వంతు ప్రమోషన్స్ చేస్తున్నారు. అదుర్స్ సినిమాకు బుక్ మై షో యాప్ లో బుకింగ్స్ కూడా అతి త్వరలో మొదలుకానున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ కోసం ఎదురుచూస్తున్నామని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus