బిగ్ బాస్ హౌస్ లో రేస్ టు ఫినాలేకి హౌస్ మేట్స్ అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఇందులో భాగంగా బిగ్ బాస్ ఫినాలే టిక్కెట్ టాస్క్ ని పెట్టాడు. వివిధ లెవల్స్ లో పాల్గొంటున్న ఇంటి సభ్యులు చివరికి ఎవరు ఎక్కువ పాయింట్స్ సాధిస్తే వాళ్లకే ఈ టిక్కెట్ టు ఫినాలే దక్కుతుంది. అయితే, ఫస్ట్ రౌండ్ లోనే శ్రీసత్య, ఇనయ, కీర్తి ముగ్గురూ అవుట్ అయ్యారు. వీళ్లకి మరో ఛాన్స్ ఇచ్చాడు బిగ్ బాస్.
రంగుపోసుకో అనే టాస్క్ లో పాల్గొన్ని ఈ ముగ్గురిలో కీర్తి గెలిచి మళ్లీ రేస్ లోకి వచ్చింది. ఈ టాస్క్ లో సంచాలక్ గా ఉన్న రేవంత్ డెసీషన్ నిర్ణయాత్మకంగా మారింది. చాలాసేపు ఆలోచించిన రేవంత్ చివరకి కీర్తిని విజేతగా ప్రకటించాడు. దీంతో ఇనయా, ఇంకా శ్రీసత్య ఇద్దరూ తదుపరి గేమ్స్ కి సంచాలక్ గా మారారు. ఇక్కటే బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. తదుపరి రౌండ్ లో పార్టిసిపేట్ చేయాలంటే, పోటీదారులు ఏకాభిప్రాయంతో ఇద్దరిని తొలగించాలని చెప్పాడు.
దీంతో హౌస్ మేట్స్ అసహనానికి గురి అయ్యారు. ఈ టైమ్ లో ఏకాభిప్రాయం ఏంటని బిగ్ బాస్ ని నిలదీశారు. శ్రీహాన్ అయితే నేను గేమ్ లో లేకపోతే మొత్తం టాస్క్ లో ప్లేట్స్ అన్ని పగలకొట్టేసి ఎవ్వరినీ కూడా గెలవనివ్వనని చెప్పాడు. అలాగే, మిగతా వాళ్లు కూడా ఏకాభిప్రాయం కుదరదని తెగేసి చెప్పారు. దీంతో బిగ్ బాస్ పోటీదారుల వల్ల కాకపోతే సంచాలక్ అయిన శ్రీసత్య, ఇనయా ఇద్దరినీ చెప్పమని ఆదేశించాడు. చేసేది లేక పాయింట్స్ ఆధారంగా లీస్ట్ లో ఉన్న ఇద్దర్నీ వీళ్లు తొలగించారు.
వీళ్లలో కీర్తి, ఇంకా రోహిత్ ఇద్దరూ ఉన్నారు. ఇక పోటీలో నుంచీ తప్పుకుని అసహనంగా ఉన్న కీర్తి ఇనయాతో గొడవ వేస్కుంది. ఇద్దరూ కాసేపు అరుచుకున్నారు. దీంతో బిగ్ బాస్ మరోసారి ఆలోచించి, అందరికీ పాయింట్స్ ని ఇచ్చాడు. ఈ పాయింట్స్ లో రోహిత్ ఇంకా కీర్తి ఇద్దరూ పోటీలో నిలిచారు. కానీ, తక్కువ పాయింట్స్ తో ఉన్నారు. ఇక సెకండ్ రౌండ్ లో బ్యాలన్సింగ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో నలుగురు సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ లోనే పైమా అవుట్ అయిపోయింది.
ప్లేట్స్ ని బ్యాలన్స్ చేసేటపుడు సంచాలక్ శ్రీసత్యకి ఇంకా రేవంత్ కి ఇద్దరికీ గొడవ అయ్యింది. కావాలనే స్పీడ్ గా చెప్పావంటూ రేవంత్ శ్రీసత్యని ప్రశ్నించాడు. దీంతో శ్రీసత్య ఆటలో ఓడిపోతే తీస్కోవాలంటూ రేవంత్ కి బుద్దులు చెప్పింది. కఇక్కడ శ్రీసత్యకి ఇంకా రేవంత్ కి గట్టి ఆర్గ్యూమెంట్ అయ్యింది. రేవంత్ తన చేయి తగిలి కప్పులని కింద పారేసుకున్నాడు. బ్యాలన్స్ చేయడంలో తడబడ్డాడు. దీనికి శ్రీసత్యని నిందించాడు. శాడిజం నేను కూడా చూపిస్తా అంటూ విసురుగా వెళ్లిపోయాడు. అందుకే, శ్రీసత్య వచ్చి రేవంత్ తో ఆర్గ్యూమెంట్ పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి ఇద్దరూ కలిసిపోయారు.
టాస్క్ లో లాస్ట్ లో శ్రీహాన్ ఇంకా ఆదిరెడ్డి ఉన్నప్పుడు శ్రీహాన్ కప్పులు కిందపడిపోయాయి. దీంతో శ్రీహాన్ ఒక పాయింట్ ని కోల్పోయాడు. చివరివరకూ బ్యాలన్స్ చేసిన ఆదిరెడ్డి అందరికంటే ఎక్కువ పాయింట్స్ సాధించి రేస్ లో ముందుకెళ్లాడు. తొమ్మిది పాయింట్స్ తో ఉన్న ఆదిరెడ్డి టాప్ ప్లేస్ లో ఉన్నాడు. అయితే, సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం ఆదిరెడ్డినే టిక్కెట్ టు ఫినాలే గెలిచినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఎలా గెలిచాడు అనేది తర్వాత టాస్క్ లలో ఆధారపడి ఉంటుంది. మొత్తానికి అదీ మేటర్.