Sandeep Reddy Vanga: రూ.200 కోట్లు ఇచ్చినా యానిమల్ చేసేవాడిని కాదు.. నటుడి కామెంట్స్ వైరల్!

అర్జున్ రెడ్డి (Arjun Reddy) , కబీర్ సింగ్, యానిమల్ (Animal) సినిమాలతో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) వరుసగా భారీ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నారు. ఈ సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించాయి. సందీప్ రెడ్డి వంగా పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగుతుండగా ఆయన భవిష్యత్తు సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా సినిమాలపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు అదిల్ హుస్సేన్ (Adil Hussain) కబీర్ సింగ్ సినిమాలో కాలేజ్ డీన్ పాత్రలో నటించారు.

అయితే ఆ పాత్రలో నటించడం విషయంలో ఫీలయ్యానని అదిల్ హుస్సేన్ పేర్కొన్నారు. 100 నుంచి 200 కోట్ల రూపాయలు ఇచ్చినా తాను యానిమల్ సినిమాలో నటించబోనని పేర్కొన్నారు. సందీప్ రెడ్డి వంగా ఏమైనా లైఫ్ ఆఫ్ పై డైరెక్టర్ ఆంగ్ లీ అనుకున్నారా అని కామెంట్లు చేశారు. లైఫ్ ఆఫ్ పై సినిమాలో తాను నటించానని ఆ సినిమాకు 5,000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు వచ్చాయని కబీర్ సింగ్ కలెక్షన్లు ఆ సినిమా కంటే తక్కువేనని లైఫ్ ఆఫ్ పై కలెక్షన్లను సందీప్ రెడ్డి వంగా సినిమాలు క్రాస్ చేయలేవని అదిల్ హుస్సేన్ చెప్పుకొచ్చారు.

అదిల్ హుస్సేన్ కామెంట్ల గురించి మరోసారి సందీప్ రెడ్డి వంగా రియాక్ట్ అవుతారేమో చూడాల్సి ఉంది. సందీప్ రెడ్డి వంగా తన డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు సంబంధించి సొంత బ్యానర్ భాగస్వామ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సందీప్ రెడ్డి వంగా రేంజ్ అంతకంతకూ పెరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎంతగానో సంతోషిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా సందీప్ రెడ్డి వంగా సత్తా చాటుతూ ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు. సందీప్ రెడ్డి వంగా భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో ఏ రేంజ్ లో సత్తా చాటుతారో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus