Kriti Sanon: ఆదిపురుష్ సీత కొనుగోలు చేసిన కొత్త ఫ్లాట్ ఖరీదు ఎంతో తెలుసా?

ప్రభాస్ (Prabhas) ఓం రౌత్ (Om Raut) కాంబినేషన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ (Adipurush) మూవీపై ఏ స్థాయిలో ట్రోల్స్ వచ్చాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమలో కృతిసనన్ (Kriti Sanon) సీత పాత్రలో నటించి మెప్పించారు. కృతిసనన్ కెరీర్ పరంగా వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా తాజాగా కృతి సనన్ మరో లగ్జరీ ఫ్లాట్ ను కొనుగోలు చేయడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. కృతిసనన్ తన సంపాదనను తెలివిగా ఇన్వెస్ట్ చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ముంబైలోని అలీబాగ్ ప్రాంతంలో 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఈ బ్యూటీ స్థలాన్ని కొనుగోలు చేసినట్టు సమాచారం అందుతోంది. జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ బ్యూటీ కెరీర్ పరంగా వరుసగా ఆఫర్లను సొంతం చేసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసి బంగళా, ఫ్లాట్స్ ను ఈ బ్యూటీ కొనుగోలు చేశారు.

ప్రస్తుతం కృతిసనన్ కొనుగోలు చేసిన ఫ్లాట్ 2000 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఉందని భోగట్టా. ది హౌస్ ఆఫ్ అభినందన్ లోదా అనే ప్రాజెక్ట్ లో కృతిసనన్ ఫ్లాట్ కొనుగోలు చేశారని సమాచారం అందుతోంది. కొన్నిరోజుల క్రితం అమితాబ్ సైతం ఈ ప్రాజెక్ట్ లో ఫ్లాట్ ను కొనుగోలు చేశారని భోగట్టా. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను ఆమె పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నారని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కృతి సనన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. కృతిసనన్ తెల్లుగులో రీఎంట్రీ ఇచ్చి మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతుండటం గమనార్హం. కృతి సనన్ ఎంపిక చేసుకునే ప్రాజెక్ట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus