Kriti Sanon: మై జాన్ అంటూ అలాంటి ఫోటోని షేర్ చేసిన నటి!

వెండితెర నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించిన కృతి సనన్ మరొక మూడు రోజులలో సీతమ్మ తల్లిగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ప్రభాస్ కృతి సనన్ హీరో హీరోయిన్లుగా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ఆది పురుష్. ఈ సినిమా జూన్ 16వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలలో అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ కావడంతో భారీ స్థాయిలో బుకింగ్స్ కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.

ఇలా ఈ సినిమా మరొక మూడు రోజులలో విడుదల కానున్న నేపథ్యంలో నటి కృతి సనన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె షేర్ చేసిన ఫోటోలో ఉన్న స్త్రీ తన హృదయంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుందని చెప్పే ప్రయత్నం చేశారు.

కృతి సనన్ (Kriti Sanon) షేర్ చేసిన ఈ ఫోటోలో ఒకవైపు ఆమె సీతమ్మ పాత్రలో ఉన్న ఫోటోని షేర్ చేయగా మరొక ఫోటోలు అచ్చం అదే గెటప్ లో తన తల్లి గీతా సనన్ త్రో బ్యాక్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సీతాదేవిని తన జానకీగానూ, తన తల్లిని జాన్ అంటూ తెలియజేసింది. సీతాదేవి తన తల్లి లాంటిదని చెప్పే ప్రయత్నం చేసింది. దీంతో ఫొటో నెట్టింట వైరల్ అవుతుంది.

ఇక ఈ సినిమా మరొక మూడు రోజులలో విడుదల కానున్న నేపథ్యంలో ఈమె ఈ విధంగా సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు అంటూ పలువురు భావిస్తున్నారు.ఇక ఈ సినిమా మూడు రోజులలో విడుదల కానున్న నేపథ్యంలో ప్రభాస్ మాత్రం ఎక్కడ ఇంటర్వ్యూలకు కానీ ఇతర ఈవెంట్ లలో పాల్గొనక పోవడం గమనార్హం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus