Prabhas: స్టార్ హీరో ప్రభాస్ రేంజ్ కు ప్రూఫ్ ఇదే!

స్టార్ హీరో ప్రభాస్ కొన్నేళ్ల క్రితం వరకు టాలీవుడ్ ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన బాహుబలి ది బిగినింగ్ హిందీలో కూడా అంచనాలను మించి విజయం సాధించడంతో ప్రభాస్ కు ఊహించని స్థాయిలో పాపులారిటీ దక్కింది. బాహుబలి ది కంక్లూజన్ ఫస్ట్ పార్ట్ కు రెండు రెట్లు ఎక్కువ కలెక్షన్లను సాధించి ప్రభాస్ ఖాతాలో అరుదైన రికార్డులను చేర్చింది. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహుబలి పాత్రలలో తను తప్ప మరెవరూ నటించలేరన్నంత అద్భుతంగా ప్రభాస్ నటించారు.

Click Here To Watch

బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ నటించిన సాహో తెలుగులో సక్సెస్ సాధించకపోయినా హిందీలో మాత్రం సక్సెస్ సాధించి భారీ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంది. ప్రభాస్ భవిష్యత్తు సినిమాలన్నీ కళ్లు చెదిరే బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయి. ప్రభాస్ తో సినిమా అంటే కనీసం 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించాలని నిర్మాతలు సైతం ఫిక్స్ అయ్యారు.

ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ ఈ ఏడాది అగష్టు నెల 11వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో అదిరిపోయే ఫారెస్ట్ సీక్వెన్స్ ఉంటుందని ఆ సీక్వెన్స్ కోసం ఏకంగా 60 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని సమాచారం. ఒక సీక్వెన్స్ కోసం ఊహించని స్థాయిలో ఖర్చు చేశారని ప్రభాస్ రేంజ్ కు ప్రూఫ్ ఇదేనని ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఆదిపురుష్ సినిమాకే హైలెట్ అనే విధంగా ఈ సన్నివేశాలు ఉండనున్నాయని బోగట్టా. వేర్వేరు దేశాలకు చెందిన 50కు పైగా కంపెనీలు ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ కోసం పని చేస్తుండటం గమనార్హం.

రామాయణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కగా కృతిసనన్ ఈ సినిమాలో సీత పాత్రలో నటించారు. ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. ఇతర దేశాల భాషల్లో కూడా ఈ సినిమాను డబ్బింగ్ చేయనున్నారని తెలుస్తోంది. త్వరలో ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుకానున్నాయి. ఓం రౌత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

భామా కలాపం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఖిలాడి సినిమా రివ్యూ & రేటింగ్!
సెహరి సినిమా రివ్యూ & రేటింగ్!
10 మంది పాత దర్శకులితో ఇప్పటి దర్శకులు ఎవరు సరితూగుతారంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus