Adipurush: ఆదిపురుష్ రికార్డులు అక్కడినుండే మొదలు!

ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మైథలాజికల్ మూవీ ‘ఆదిపురుష్’ ఈరోజు అనగా జూన్ 16 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ట్రైలర్లు, పాటలు సినిమా పై మంచి అంచనాలు ఏర్పడేలా చేసాయి. దీంతో అడ్వాన్స్ బుకింగ్స్ అదిరిపోయాయి అనే చెప్పాలి.

ఇక తొలి షోతోనే ఈ మూవీ మిక్స్డ్ టాక్ ను మూటగట్టుకుంది. అయినప్పటికీ మొదటి రోజు భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతుంది ‘ఆదిపురుష్’ చిత్రం. ఈ ఏడాది చాలా గ్యాప్ తర్వాత వచ్చిన పెద్ద సినిమా కావడంతో.. ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఓవర్సీస్ లో ‘ఆదిపురుష్’ చిత్రం బుకింగ్స్ చాలా బాగున్నాయని సమాచారం. అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం.. ఓవర్సీస్ లో ‘ఆదిపురుష్’ మూవీ 1 మిలియన్ కి పైగా డాలర్లను వసూల్ చేసిందని (Adipurush) చిత్ర బృందం ఓ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.

ఓవర్సీస్ కలెక్షన్స్ అనేవి పక్కా ట్రాకింగ్ ఉంటాయి కాబట్టి.. అవి ఫేక్ అనడానికి లేదు. మొత్తానికి ఆదిపురుష్ రికార్డులు ఓవర్సీస్ నుండి మొదలైనట్టు స్పష్టమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలి. ఇక ‘ఆదిపురుష్’ లో ప్రభాస్ కి జోడీగా కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించాడు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus