Adipurush Tickets: తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ మూవీ బుకింగ్స్ చూస్తే షాకవ్వాల్సిందే!

మరికొన్ని గంటల్లో ఆదిపురుష్ మూవీ థియేటర్లలో విడుదల కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆదిపురుష్ మూవీ బుకింగ్స్ మొదలుకావాల్సి ఉన్నా మెజారిటీ ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికే ఆదిపురుష్ మూవీ బుకింగ్స్ మొదలయ్యాయి. హైదరాబాద్ లో ఆదిపురుష్ మూవీని తొలిరోజు చూడాలని భావించే వాళ్లకు భారీ షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఆదిపురుష్ త్రీడీ, 2డీ వెర్షన్ బుకింగ్స్ ఊహించని రేంజ్ లో ఉన్నాయి.

ఆదిపురుష్ పై ప్రేక్షకుల్లో ఉన్న నెగిటివిటీ మొత్తం పోయిందని చెప్పవచ్చు. బన్నీ మల్టీప్లెక్స్ అయిన ఏఏఏ సినిమాస్ లో కూడా ఆదిపురుష్ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ మొదలయ్యాయి. ఆదిపురుష్ బుకింగ్స్ భారీ స్థాయిలో ఉండటంతో ప్రభాస్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. సాహోరే ఆదిపురుష్ అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రామునిపై ఉన్న భక్తికి ప్రభాస్ క్రేజ్ తోడు కావడంతో ఈ స్థాయిలో బుకింగ్స్ జరుగుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆదిపురుష్ మూవీ నిర్మాతలకు రిలీజ్ తర్వాత కూడా భారీ లాభాలను అందించే ఛాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మరోవైపు ప్రేక్షకుల్లో రావణుని పాత్రను ఎలా చూపించారనే సస్పెన్స్ కొనసాగుతోంది. ఆదిపురుష్ మూవీ కచ్చితంగా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసే మూవీ అవుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ మూవీ కథ, కథనం కొత్తగా ఉండవని అయితే దర్శకుడు తెరపై చూపించే విధానం మాత్రం కొత్తగా ఉండనుందని సమాచారం.

ఆదిపురుష్ (Adipurush) థియేటర్లకు ప్రేక్షకులు క్యూ కడుతుండగా అంచనాలను అందుకుని ఆదిపురుష్ ప్రేక్షకులను మెప్పించాలని ఆశిద్దాం. కృతిసనన్, సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమా సక్సెస్ సాధిస్తే ఇతర భాషల్లో సైతం తమ మార్కెట్ పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఈ సినిమా నిజంగానే ప్రభాస్ మార్కెట్ ను పెంచుతుందేమో చూడాల్సి ఉంది. ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus