పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆదిపురుష్’. కృతి సనన్ హీరోయిన్ గా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ మైథలాజికల్ మూవీని ‘టి సిరీస్ ఫిలిమ్స్’ ‘రిట్రోఫిల్స్ బ్యానర్ల పై భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. సైఫ్ అలీ ఖాన్, సన్నీ సింగ్, వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ జూన్ 16 న విడుదల కాబోతోంది.
హిందీ, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో విడుదల కాబోతోంది. హిందీలో ప్రభాస్ నటించిన స్ట్రైట్ మూవీ ఇది. మొదట ఈ సినిమా పై అంచనాలు లేవు కానీ ట్రైలర్స్ తో బాగా పెరిగాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. ఒకసారి వారి వివరాలు గమనిస్తే :
నైజాం | 48.50 cr |
సీడెడ్ | 17.50 cr |
ఉత్తరాంధ్ర | 12.20 cr |
ఈస్ట్ | 8.00 cr |
వెస్ట్ | 7.00 cr |
గుంటూరు | 7.20 cr |
కృష్ణా | 8.70 cr |
నెల్లూరు | 3.80 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 112.90 cr |
హిందీ | 70.00 cr |
తమిళ్ | 4.50 cr |
కర్ణాటక | 12.50 cr |
కేరళ | 2.00 cr |
ఓవర్సీస్ | 27.00 cr |
వరల్డ్ వైడ్ (టోటల్ ) | 228.90 cr |
‘ఆదిపురుష్’ (Adipurush) చిత్రానికి రూ.228.9 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.230 కోట్ల షేర్ ను రాబట్టాలి. టాక్ పాజిటివ్ గా వస్తే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఉంటాయి. లేకుంటే కష్టమే అని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి.
ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్