ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కావాల్సిన ఈ సినిమా సమ్మర్ కు వాయిదా పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా టీజర్ గురించి ఊహించని స్థాయిలో నెగిటివ్ ప్రచారం జరగడంతో ఈ సినిమా బిజినెస్ పై ఆ ప్రభావం పడటం గమనార్హం. అయితే నెగిటివ్ కామెంట్ల వల్ల విజువల్ ఎఫెక్ట్స్ కు సంబంధించి కీలక మార్పులు చేస్తున్నారు.
ఆదిపురుష్ మూవీ వాయిదా పడటానికి ఇది ఒక కారణం కాగా మళ్లీ వర్క్ చేస్తుండటం వల్ల ఈ సినిమా బడ్జెట్ 100 కోట్ల రూపాయలు పెరిగింది. ఈ సినిమా బడ్జెట్ ఏకంగా 600 కోట్ల రూపాయలు కాగా ఆ రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరుగుతుందో లేదో చూడాలి. తెలుగు రాష్ట్రాల నుంచి నిర్మాతలు ఏకంగా 200 కోట్ల రూపాయలు ఆశిస్తున్నట్టు సమాచారం అందుతోంది. టీ సిరీస్ నిర్మాతలు బడ్జెట్ విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదని తెలుస్తోంది.
నెగిటివ్ కామెంట్ల వల్ల ప్రభాస్ మూవీకి ఈ స్థాయిలో నష్టం అని తెలిసి నెటిజన్లు సైతం షాకవుతున్నారు. ఆదిపురుష్ మూవీ నాన్ థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఆదిపురుష్ సినిమాతో ప్రభాస్ కచ్చితంగా సక్సెస్ ను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమా సక్సెస్ సాధించడం కృతిసనన్ కు కూడా కీలకమే అనే సంగతి తెలిసిందే.
ప్రభాస్, కృతిసనన్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమా విషయంలో ఓం రౌత్ తనది హామీ అని చెబుతుండగా ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే ఆయనకు కూడా కొత్త సినిమా ఆఫర్లు వస్తాయి. ప్రభాస్ ఈ సినిమా కోసం 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం.