Adipurush: ‘ఆదిపురుష్’ 2వ రోజు వసూళ్లు చూస్తే మెంటలెక్కిపోతారు!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘ఆదిపురుష్’ మూవీ ఇటీవలే ఘనంగా విడుదలై డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. టాక్ అయితే డివైడ్ టాక్ వచ్చింది కానీ, వసూళ్లు మాత్రం అలా లేవు. మొదటి రోజు ఓపెనింగ్ అదిరిపోయింది, హైప్ ఉంది కదా , ఓపెనింగ్స్ రావడం లో గొప్పేమి ఉంది అనుకోవచ్చు, కానీ రెండవ రోజు కూడా ఇతర స్టార్ హీరోల సినిమాలకు సూపర్ హిట్ టాక్ పడితే ఎలాంటి వసూళ్లు అయితే వస్తాయో, అంతకు మించి వసూళ్లు వస్తున్నాయి

కేవలం రెండవ రోజు ఈ చిత్రానికి అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి రెండవ రోజు 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఇది ఆల్ టైం నాన్ రాజమౌళి సెన్సేషనల్ రికార్డు అని చెప్పొచ్చు. నెగటివ్ టాక్ వచ్చిన ఒక సినిమాకి ఈ స్థాయి వసూళ్లు రావడం అనేది సాధారణమైన విషయం కాదు. నిన్న నూన్ షోస్ నుండి కాస్త కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి, రెండవ రోజు పెద్దగా ఏమి ఉండదు ఏమో, కచ్చితంగా సోమవారం నుండి చిల్లర వసూళ్లు వస్తాయని అంచనా వేశారు.

కానీ మ్యాట్నీ షోస్ నుండి ఈ చిత్రం విశ్వరూపం చూపించేసింది. ఎక్కడ చూసిన ప్రేక్షకులతో కిటకిటలాడిపోయాయి థియేటర్స్. ఈ స్థాయి వసూళ్లను అభిమానులు సైతం ఊహించలేదు. కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమా రెండవ రోజు 7 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది.

అలాగే సీడెడ్ ప్రాంతం లో కోటి 75 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం లో రెండు కోట్ల 10 లక్షల రూపాయిలు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 94 లక్షలు , నెల్లూరు లో 40 లక్షల వసూళ్లు రాబట్టింది. ఇది నిజంగా ఎవ్వరూ ఊహించని వసూళ్లే అని చెప్పొచ్చు . బ్రేక్ ఈవెన్ కి సాధ్యం కాదు కానీ, 80 శాతం వరకు ఆదిపురుష్ ప్రీ రిలీజ్ బిజినెస్ రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus