Adipurush OTT: రూల్స్‌ ఫాలో అవుతూ ఓటీటీలోకి రానున్న ‘ఆదిపురుష్‌’.. ఎక్కడ? ఎప్పుడంటే?

ప్రభాస్‌ ఫ్యాన్స్‌, సగటు సినిమా ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్న (?) సినిమా రానే వచ్చేసింది. ఎన్నో అవాంతరాలు దాటుకొని, మాటలు పడి సినిమాను రిలీజ్‌ చేసేశారు. ఇక సినిమాకు థియేటర్‌లో ఎలాంటి స్పందన వస్తోంది అనే విషయం మన రివ్యూలో చదవొచ్చు. అయితే ఇప్పుడు ఈ వార్త ఓటీటీ గురించి. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి ఇటు టీమ్‌ నుండి అధికారికంగా సమాచారం వచ్చింది. సినిమా చూశాక ఓటీటీ పార్ట్నర్‌ ఎవరో కూడా తెలిసిపోయింది.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే గతంలో సినిమా ఇండస్ట్రీ పెట్టుకున్న రూల్స్‌ ప్రకారం సినిమాను 50 రోజుల తర్వాతే ఓటీటీకి ఇవ్వనున్నారు. అయితే ఫలితంలో ఏమైనా మార్పు వస్తే చెప్పలేం. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే.. సినిమాను ఎనిమిది వారాల తర్వాత విడుదల చేస్తారు. దీని కోస అమెజాన్‌ ప్రైమ్‌తో టీమ్‌ డీల్‌ కుదుర్చుకుందట. ఎంత మొత్తంలో డీల్‌ కుదిరింది అనే విషయం తెలియదు కానీ.. భారీగానే ఈ డబ్బులు ఉన్నాయని చెబుతున్నారు.

సినిమా క‌థేంటంటే… వాల్మీకి రామాయ‌ణంలోని ప్ర‌ధాన ఘ‌ట్టాల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. రాఘ‌వ (ప్ర‌భాస్‌) వ‌న‌వాసం స్వీక‌రించ‌డం నుండి ఈ సినిమా క‌థ ప్రారంభం అవుతుంది. స‌త్యం, ధ‌ర్మ‌మే త‌న ఆయుధంగా అర్ధాంగి జాన‌కి (కృతి స‌న‌న్‌), సోద‌రుడు శేషు (స‌న్నీ సింగ్‌)తో క‌లసి వ‌న‌వాసం గ‌డుపుతుంటాడు రాఘవుడు. లంకని ఏలుతున్న లంకేశ్ (సైఫ్ అలీ ఖాన్‌) త‌న సోద‌రి శూర్ప‌ణ‌ఖ చెప్పిన మాటలు విని జాన‌కిని అప‌హ‌రించి అశోక‌వ‌నంలో బంధిస్తాడు. ఈ క్రమంలో త‌న జాన‌కిని తిరిగి తీసుకొచ్చేందుకు రాఘ‌వ ఏం చేశాడు అనేదే కథ.

ఈ కథ అందరికీ తెలిసిందే అయినా.. ఇప్పటి తరం వాళ్లకు సులభంగా అర్థమయ్యేలా ఈ సినిమాను ఓం రౌత్ రూపొందించారు. అయితే మనం ఇన్నాళ్లూ చూసిన రామాయణానికి కొన్ని సన్నివేశాలు దూరంగా ఉండటం గమనార్హం. అలాగే విజువల్‌ ఎఫెక్ట్స్‌ విషయంలో కాస్త ఇబ్బంది కనిపించింది. అయితే అవన్నీ ప్రభాస్‌ మేనియా ముందు తక్కువ అయిపోయాయి అంటున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus