Adipurush OTT: ఆ ఓటీటీ ఆదిపురుష్ మూవీ హక్కులను సొంతం చేసుకుందా?

ఆదిపురుష్ మూవీ రిలీజ్ కు నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆదిపురుష్ మైథలాజికల్ సినిమా కావడం, యుద్ధ సన్నివేశాలు ఉండటంతో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాపై అంచనాలను పెంచుకున్నారు. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఆదిపురుష్ మూవీ డిజిటల్ హక్కులను కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఆదిపురుష్ విడుదలైన 50 రోజుల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని బోగట్టా. ఆదిపురుష్ మూవీ డిజిటల్ రైట్స్ గురించి అప్ డేట్ రావడంతో ఫ్యాన్స్ సంతోషిసున్నారు.

ఆదిపురుష్ మూవీ బడ్జెట్ భారీ రేంజ్ లో ఉండగా ఈ సినిమాకు బిజినెస్ కూడా భారీ రేంజ్ లో ఉంది. యునానిమస్ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఆదిపురుష్ మూవీ మరిన్ని కొత్త రికార్డులను క్రియేట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమాతో సక్సెస్ సాధించడం ప్రభాస్ కు చాలా ముఖ్యమని చెప్పవచ్చు. ఆదిపురుష్ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి అప్ డేట్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఆదిపురుష్ (Adipurush) ఎప్పుడు విడుదలైనా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ జాతకాన్ని మార్చే సినిమా ఈ మూవీ అవుతుందని కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కృతి సనన్ ఇమేజ్ ను సైతం పూర్తిస్థాయిలో మార్చేస్తుందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు నయనతారపై నెటిజన్ల నుంచి ఎలాంటి విమర్శలు వచ్చాయో ఇప్పుడు కృతిసనన్ పై అలాంటి విమర్శలే వస్తుండగా కృతి సనన్ ఆ విమర్శలకు చెక్ పెడతారేమో చూడాలి.

ఈ సినిమా కోసం కృతిసనన్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో సైతం కృతిసనన్ కు వరుస విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి సైతం ఈ సినిమా సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus