ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు నెలకొన్నాయనే సంగతి తెలిసిందే. సాహో, రాధేశ్యామ్ సినిమాలు నిరాశపరిచినా ఆదిపురుష్ తో ప్రభాస్ ఖాతాలో సక్సెస్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ ఓవర్సీస్ హక్కులను 38 కోట్ల రూపాయలకు విక్రయించాలని నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం అందుతోంది. 38 కోట్ల రూపాయలు ఎక్కువ మొత్తమే అయినా ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే ఊహించని స్థాయిలో కలెక్షన్లు రావడం కష్టమేమీ కాదని చెప్పవచ్చు.
ఓం రౌత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో నటిస్తుండగా కృతిసనన్ సీత పాత్రలో నటిస్తుండటం గమనార్హం. 2023 సంక్రాంతి కానుకగా రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి2 సినిమాలను మించి రికార్డు స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఆదిపురుష్ సినిమా రిజల్ట్ విషయంలో ప్రభాస్ సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం. ఈ సినిమాతో పాటు ప్రభాస్ సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో ప్రభాస్ నటించిన రెండు సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఒక్కో సినిమాకు 80 కోట్ల రూపాయల నుంచి 120 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
ప్రభాస్ రేంజ్, రెమ్యునరేషన్ అంతకంతకూ పెరుగుతుండటంతో అభిమానులు ఎంతగానో సంతోషిస్తున్నారు. ప్రభాస్ తో ఒక్క సినిమా అయినా తెరకెక్కించాలని చాలామంది దర్శకులు ఆశపడుతున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.