Adipurush: ఆదిపురుష్ పాత్రలపై ట్రోలింగ్స్.. అలా చేస్తే అరెస్ట్ తప్పదట!

టెక్నాలజీ వల్ల ఏ స్థాయిలో లాభాలు ఉంటాయో నష్టాలు సైతం అదే స్థాయిలో ఉంటాయి. ఆదిపురుష్ సినిమాను చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది. ఆదిపురుష్ సినిమాను చూస్తే రామాయణంను తెరకెక్కిన సినిమాను చూశామనే భావన కన్నా హాలీవుడ్ సినిమాలను చూసిన భావన కలిగితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ సినిమాను ఈ విధంగా ఓం రౌత్ ఎవరికీ అర్థం కావడం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలోని కొన్ని షాట్స్ లో ప్రభాస్ లుక్స్ పై నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.

ఈ సినిమాను చూస్తే ఏదో డబ్బింగ్ సినిమాను చూసినట్టు ఉందని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఓం రౌత్ కొన్ని జాగ్రత్తలు తీసుకుని ఉంటే బాగుండేదని తన శైలి సినిమాలను తెరకెక్కించాలే తప్ప పురాణాలు, ఇతిహాసాలకు సంబంధించిన కథలతో తెరకెక్కిన సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పవచ్చు. మరోవైపు ఆదిపురుష్ సినిమాలోని ఒక పాత్రతో మహారాష్ట్ర సీఎంను పోల్చుతూ ఒక వ్యక్తి ట్వీట్ చేయగా ఆ ట్వీట్ వైరల్ అయింది.

ఆ వ్యక్తి తన ట్వీట్ లో ఆదిపురుష్ (Adipurush) మూవీలో ఏక్ నాథ్ షిండే నటించారని తనకు తెలియదని పేర్కొన్నారు. ఈ ట్వీట్ తెగ వైరల్ కాగా థానే పోలీస్ స్టేషన్ నుంచి నీ కాంటాక్ట్ నంబర్ డైరెక్ట్ మెసేజ్ లో షేర్ చేయి అంటూ రెస్పాన్స్ వచ్చింది. మరీ హద్దులు దాటి విమర్శలు చేస్తే మాత్రం సమస్యలు తప్పవని, అరెస్ట్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల విషయంలో కామెంట్లు చేసేవాళ్లు ఆచితూచి వ్యవహరిస్తే మంచిదని చెప్పవచ్చు.

ఆదిపురుష్ పలు వివాదాల్లో చిక్కుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఈ సినిమా పలు వివాదాల్లో చిక్కుకోవడం గమనార్హం. ఆ కేసుల నుంచి ఈ సినిమా ఎలా బయటపడుతుందో చూడాల్సి ఉంది.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus