ఆదిపురుష్ రైటర్ మనోజ్ ముంతాషిర్ ఈ సినిమా విషయంలో స్పందించిన తీరు చాలామందికి ఆగ్రహాన్ని కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విషయంలో ఇప్పటికీ రచ్చ కొనసాగుతోంది. ఈ సినిమా రైటర్ మనోజ్ ను, డైరెక్టర్ ఓం రౌత్ ను చంపేస్తామంటూ కొంతమంది బహిరంగంగా చెబుతుండటం గమనార్హం. రామాయణాన్ని స్పూర్తిగా తీసుకున్నామని తాము తీసింది రామాయణం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ రిలీజ్ కు ముందు రిలీజ్ తర్వాత మరో విధంగా మనోజ్ మాట్లాడటం గమనార్హం.
ఒక వ్యక్తి మనోజ్ ను చంపేస్తానంటూ మనోజ్ ఇంటికి లేఖ పంపించాడు. ఇలాంటి లేఖ రావడంతో పాటు బహిరంగంగా బెదిరింపులు రావడంతో మనోజ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మనోజ్ కోసం స్పెషల్ సెక్యూరిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మనోజ్ వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ లేఖను ఎవరు పంపించారనే విషయం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
సినిమా నచ్చకపోతే ఈ విధంగా బెదిరింపులకు పాల్పడటం కరెక్ట్ కాదని కొంతమంది సోషల్ మీడియాలో చెబుతున్నారు. సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం హద్దులు దాటుతున్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఆదిపురుష్ కు వివాదాలు ఒక విధంగా మైనస్ అవుతుండగా మరో విధంగా ప్లస్ అవుతున్నాయని వివాదాల వల్లే ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వీకెండ్ సమయానికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఆదిపురుష్ ఫుల్ రన్ లో 300 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. వీక్ డేస్ లో ఆదిపురుష్ మూవీ ఏ రేంజ్ లో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఆదిపురుష్ (Adipurush) విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.