Adireddy: బిగ్ బాస్ కి జీవితాంతం రుణపడి ఉంటాను: ఆదిరెడ్డి

ఈ ఏడాదిలో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ సిక్స్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ప్రస్తుతం 6 మంది కంటెస్టెంట్ లో ఉన్నారు. వీరిలో టాప్ ఫైవ్ కి ఎవరు చేరుకుంటారని ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల రేవంత్, శ్రీ సత్య ఇద్దరికీ ఫైనల్స్ కి వెల్కమ్ చెప్పాడు బిగ్ బాస్.

ఇక తాజాగా ఆదిరెడ్డి, రోహిత్ ఇద్దరికీ ఫైనల్స్ కి వెల్ కమ్ చెప్పాడు. ఒక్కక్కొక్కరిని గార్డెన్ ఏరియాలోకి పిలిచి బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో తమ జర్నీ గురించి అంతగా ఫోటోలు, వీడియోల రూపంలో అమర్చాడు. అయితే తన బిగ్ బాస్ జర్నీ గురించి ఫోటోలు వీడియోలు చూసిన ఆదిరెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు పనికిరాని తనని బిగ్ బాస్ ప్రయోజకుడ్ని చేసిందని, బిగ్ బాస్ రివ్యూలు చెప్పటంతో తనకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందని వెల్లడించాడు.

ఒక సామాన్య వ్యక్తుల బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన తనకి ఈ ప్రయాణం జీవితాంతం గుర్తుండి పోతుందని ఆదిరెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు. కామన్‌ మ్యాన్‌ గా వచ్చి ఇప్పుడు అందరి మనసుల్లో నిలిచిపోయావని బిగ్ బాస్ ఆదిరెడ్డిని తెగ పొగిడాడు. దీంతో ఆదిరెడ్డి చాలా ఆనందపడ్డాడు. బిగ్ బాస్ జర్నీ తనకు మోస్ట్ మెమొరబుల్ మూవ్మెంట్ అని, బిగ్ బాస్ హౌస్ లో చివరి నిమిషం వరకు ఉండాలన్న తన కోరిక తీరింది ఆదిరెడ్డి వెల్లడించాడు.

తనని ఇక్కడి వరుకు తీసుకువచ్చిన అభిమానులందరికీ కృత్ఞతలు తెలియచేశాడు. ఇక తర్వాత రోహిత్ ని కూడా గార్డెన్ ఏరియాకి పిలిచిన బిగ్ బాస్ రోహిత్ ని ఫైనల్స్ కి వెల్ కమ్ చెప్పాడు. ఇక రోహిత్ కూడా తన జర్నీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు తన భార్య ఇన్‌ స్పైరింగ్‌ వర్డ్స్ విని ఎమోషనల్‌ అయ్యారు. అంతేకాదు బిగ్ బాస్ తనని మొసలితో పోల్చటంతో చాలా సంతోష పడ్డాడు.

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus