కంగన రనౌత్ పై కేసు పెడతా…!
- September 6, 2017 / 11:23 AM ISTByFilmy Focus
బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరైన కంగన రనౌత్ పై చట్టపరమైన చర్యలు తప్పేలా కనిపించడంలేదు…దానికి కారణం ఆమె తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్‌వ్యూ. విషయంలోకి వెళితే…కంగన ఇటీవల ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆదిత్య పంచోలీ అనే బాలీవుడ్ నటుడుపై కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమయంలో తాను మైనర్‌నని, ఆ సమయంలో ఆదిత్య తనను శారీరకంగా తీవ్రంగా హింసించాడని, రక్తం వచ్చేలా కొట్టాడని ఆరోపించింది. అయితే వాటిపై స్పందించిన ఆదిత్య దీనిపై స్పందిస్తూ, కంగన రనౌత్‌కు పిచ్చిపట్టిందని, ఆమె ఓ మ్యాడ్ గాళ్’ అని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.
అంతేకాకుండా ‘‘మీరామె ఇంటర్వ్యూ చూశారా? ఓ పిచ్చిది మాట్లాడుతున్నట్టు మీకు అనిపించలేదా?’’ అని ప్రశ్నించాడు. పిచ్చి వాళ్లే కంగనలా మాట్లాడతారని దుమ్మెత్తి పోశాడు. ఆమె చెప్పిన అబద్ధాల ప్రభావం తన కుటుంబంపై పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే కంగన రనౌత్ వ్యవహారం మొదట నుంచి అంతే…బడా హీరోలపై మాట్లాడటం…సినిమా జీవితంలోని చీకటి కోణాన్ని అందరికీ తెలియజేసెలా అందరికీ చెప్పడం తెలిసిందే. అయితే కంగన రనౌత్ చెప్పిన దాంట్లో ఎంతవరకూ నిజమో, ఎంత అబద్దమో తెలీదు కానీ…ఎప్పటికప్పుడు కంగన మాత్రం ఇలా వార్తాల్లోకి ఎక్కి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటుంది అన్నది మాత్రం వాస్తవం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













