Adivi Sesh: నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను: అడివి శేష్

ఒక్కోసారి కొన్ని స్టేట్మెంట్స్ అనుకోని విధంగా వైరల్ అవుతాయి. ఎఫెక్ట్ కూడా అవుతుంటాయి. ప్రస్తుతం అడివి శేష్ ఇచ్చిన స్టేట్మెంట్ అలానే అనవసరంగా వైరల్ అయ్యింది. “లిటిల్ హార్ట్స్” సక్సెస్ సెలబ్రేషన్స్ లో అడివి శేష్ మాట్లాడుతూ “నేను హిట్ డైరెక్టర్ కి డిన్నర్ పెట్టి ప్రాజెక్ట్ సెట్ చేసుకోలేను” అని యధాలాపంగా అన్న ఒక్క మాట సోషల్ మీడియా మొత్తం రచ్చ లేపింది.

Adivi Sesh

శేష్ కావాలని వాళ్లని ఉద్దేశించి అనకపోయినా.. మెగా ఫ్యామిలీని అన్నాడని ట్విట్టర్ లో దుమ్ము లేపుతున్నారు. అందుకు కారణం చిరంజీవి పలువురు స్టార్ డైరెక్టర్లను లంచ్ లేదా డిన్నర్ కి ఇన్వైట్ చేసి తన కుమారుడు రామ్ చరణ్ కోసం సినిమా సెట్ చేస్తాడు అనే రూమర్ ఇండస్ట్రీలో ఉండడమే. గతంలో విజయ్ దేవరకొండ ఒక ఇంటర్వ్యూలో ఇచ్చిన స్టేట్మెంట్ ను కూడా ఇలా మెగా ఫ్యామిలీకి లింక్ చేసి తెగ ట్రోల్ చేశారు.

అయితే.. అడివి శేష్ కి మెగా ఫ్యామిలీతో మంచి అసోసియేషన్ ఉంది. అకీరాతో అంతకు మించిన స్నేహం ఉంది. అలాంటప్పుడు శేష్ కావాలని టార్గెట్ చేసి డైలాగ్స్ వేసే ప్రసక్తే లేదు. కానీ.. ఇప్పుడు అనవసరంగా టార్గెట్ అయ్యాడు కాబట్టి కొన్ని రోజులు తప్పదు ఈ సోషల్ మీడియా లొల్లి. అలాగే శేష్ స్పందిస్తే ఇలాంటివి ఏదో ఒకటి అవుతూనే ఉంటాయి కాబట్టి, ప్రతిసారి స్పందించాల్సి ఉంటుంది.

కానీ.. అదే ఈవెంట్లో మౌళి ఫాదర్ తో కలిసి శేష్ వేసిన స్టెప్పులు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక కొత్త సినిమాని, మంచి సినిమాని ఎంకరేజ్ చేయడంలో శేష్ ఎప్పుడూ ముందుంటాడని మరోసారి నిరూపించుకున్నారు. ఇకపోతే.. కొంచం గ్యాప్ తర్వాత “డెకాయిట్, G2” చిత్రాలతో ప్రేక్షకులని పలకరించనున్న శేష్, ఇకపై ఇంత గ్యాప్ తీసుకోకుండా ఉంటే బెటర్.

పవన్ కళ్యాణ్ సినిమాకి ఇదే మొదటిసారి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus