పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్లో ఇప్పటివరకు చేసిన ఏ ఒక్క సినిమాకి రాని పరిస్థితి ఇప్పుడు “ఓజీ”కి ఎదురైంది. కళ్యాణ్ సినిమాలన్నీ ఇప్పటివరకు మోస్ట్లీ సెన్సార్ బోర్డ్ నుండి యు/ఏ లేదా యు సర్టిఫికేట్ అందుకున్నాయి. అందువల్ల పవన్ కళ్యాణ్ సినిమాలకి కుటుంబాలతో కలిసి వచ్చేవాళ్ళు జనాలు. కానీ.. మొట్టమోదరిసారిగా పవన్ కళ్యాణ్ సినిమాకి “A” సర్టిఫికెట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సినిమాలో ఉన్న రక్తపాతం మరియు డ్రగ్స్ సీన్స్ కారణంగా ఈ సర్టిఫికేషన్ తప్పేలా లేదని తెలుస్తోంది.
అయితే.. వాటిని బ్లర్ చేసి యు/ఏ సర్టిఫికెట్ అందుకునే అవకాశం కూడా ఉన్నప్పటికీ, సుజీత్ మాత్రం తగ్గడం లేదట. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫ్యాన్స్ కూడా సుజీత్ కే ఓటు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఈస్థాయి రా & రస్టిక్ పెర్ఫార్మెన్స్ చూడబోతుండడం ఇదే మొదటిసారి కాబట్టి, A సర్టిఫికెట్ సినిమా అయినా పర్లేదు అనుకుంటున్నారు. అయితే.. ఇక్కడ సమస్య ఏమిటంటే, మల్టీప్లెక్స్ థియేటర్లలో A సర్టిఫికెట్ సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి.
18 ఏళ్ల లోపు పిల్లల్ని లోపలికి అనుమతించరు. ఒకవేళ ఫ్యామిలీ ఆడియన్స్ తమ పిల్లల్ని భుజాన వేసుకుని వచ్చినా అనుమతించరు. రూల్స్ ప్రకారం వాళ్లు చేసే పనిలో అస్సలు తప్పు లేదు. కానీ.. ఇబ్బందిపడేది ఈ రూల్స్ ను పట్టించుకోకుండా థియేటర్లకి పిల్లలతో వచ్చే ప్రేక్షకులే. ఈ ఎఫెక్ట్ సినిమా కలెక్షన్స్ మీద కూడా పడుతుంది. మరి ఈ సమస్యను “ఓజీ” టీమ్ ఎలా అధిగమిస్తారో చూడాలి.
ఇకపోతే.. వచ్చే 10 రోజులు ఇండస్ట్రీ & సోషల్ మీడియా మొత్తం “ఓజీ” సంబరాలతో రచ్చ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ట్రైలర్ లాంచ్, సాంగ్ రిలీజులు మరియు ప్రీరిలీజ్ ఈవెంట్ తో హల్ చల్ చేయనున్నారు. ఆల్రెడీ ఫుల్ హైప్ ఉన్న ఈ సినిమాకి ఇవన్నీ ఎక్స్ట్రా బోనస్ లు లాంటివి.