కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఆంటోనీ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం బిచ్చగాడు 2. 2016 వ సంవత్సరంలో బిచ్చగాడు సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులు ముందుకు వచ్చిన విజయ్ ఆంటోని తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన బిచ్చగాడు2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా 19వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాశ్ పూరి, హీరో అడివి శేష్ ఈ సినిమా ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ క్రమంలోని ఆకాష్ ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను బిచ్చగాడు సినిమా చూస్తున్న తర్వాత విజయ్ గారికి పెద్ద అభిమానిగా మారిపోయానని తెలియజేశారు.. ప్రస్తుతం తనని నేరుగా ఇలా చూస్తుంటే తనపై ఎంతో గౌరవం పెరిగిందని ఈ సందర్భంగా ఆకాష్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి హీరో (Adivi Sesh) అడివి శేష్ సైతం ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేసామని ప్రతి ఒక్కరు అంటారు కానీ బిచ్చగాడు 2 సినిమా కోసం విజయ్ ఫాతిమా ఇద్దరూ కూడా ప్రాణం పెట్టి పనిచేసారని తెలిపారు.ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని శేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇక ఈ సినిమాకు విజయ్ ఆంటోనీ భార్య ఫాతిమా నిర్మాతగా వ్యవహరించగా ఈ సినిమాకు విజయ్ హీరోగా దర్శకుడిగా సంగీత దర్శకుడిగా కూడా పనిచేశారు.బిచ్చగాడు సినిమా మదర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా సిస్టర్ సెంటిమెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈ సినిమా కూడా అదే స్థాయిలో సక్సెస్ అందుకుంటుందా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.
కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!