Adivi Sesh: ‘జి2’ హీరో సినిమా ‘జిఏ2’ లో ఎప్పుడంటే?

అడివి శేష్ వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న హీరో. ‘క్షణం’ నుండి తీసుకుంటే అతను నటించిన అన్ని సినిమాలు సూపర్ హిట్లే. ‘క్షణం’ ‘అమీ తుమీ’ ‘గూడఛారి’ ‘ఎవరు’ ‘మేజర్’ ‘హిట్ 2’ .. ఇలా వరుస సక్సెస్..లతో తన మార్కెట్ ను పెంచుకుంటూనే పోతున్నాడు అడివి శేష్. ‘మేజర్’ సినిమాతో ఓ రకంగా పాన్ ఇండియా హీరో కూడా అయిపోయాడు అని చెప్పాలి. ప్రస్తుతం ‘గూఢచారి 2 ‘ చేస్తున్నాడు.

ఇలాంటి సక్సెస్ ఫుల్ హీరోతో సినిమా చేయడానికి పెద్ద నిర్మాణ సంస్థలు అన్నీ ఎగబడుతుంటాయి. చాలా వరకు ఎగబడుతున్నాయి కూడా. అయితే కొత్త హీరోలు ఎవరు వరుస సక్సెస్..లు కొట్టినా వెంటనే తమ బ్యానర్లో సినిమాలు చేయడానికి ఆఫర్ చేసే బ్యానర్ .. అల్లు అరవింద్ గారి ‘జిఎ2 పిక్చర్స్’ అనే చెప్పాలి. ఎందుకో ఆ బ్యానర్ ఇంకా అడివి శేష్ పై ఫోకస్ పెట్టలేదు. శేష్ కూడా ఇదే ఫీలైనట్టు ఉన్నాడు.

ఈరోజు జరిగిన ‘అంబాజీ పేట మ్యారేజీబ్యాండు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన అతను.. తన మనసులో మాటని బయటపెట్టేశాడు. ‘జీ2 (గూఢచారి 2) హీరో అయిన నాతో ‘జిఎ2′ బ్యానర్ ఇంకా సినిమా చేయడానికి కాల్ చేయలేదు’ అంటూ స్టేజిపై అడివి శేష్ కామెంట్ చేశాడు. దీనికి నిర్మాత ఎస్.కె.ఎన్ వెంటనే స్పందించి ‘ మేము మీతో సినిమా చేయాలని ట్రై చేశాము అండీ..

కానీ 2 ఏళ్ళ వరకు మీ కాల్షీట్లు ఖాళీ లేవు అని మీ మేనేజర్ మాకు చెప్పాడు.. అందుకే అప్పటివరకు ఆగుదామని అనుకున్నాం’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఏదేమైనా ‘జిఎ2 బ్యానర్లో (Adivi Sesh) అడివి శేష్ సినిమా చేస్తే కచ్చితంగా .. అతనికి ఓ వంద కోట్ల సినిమా వస్తుంది’ అని గ్యారెంటీగా చెప్పొచ్చు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus