Adivi Sesh: 2 ఏళ్ళ గ్యాప్ ని.. అడివి శేష్ అలా మరిపిస్తాడట..!

టాలీవుడ్ కి జేమ్స్ బాండ్ తరహా సినిమాలు అందిస్తూ సూపర్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు అడివి శేష్ (Adivi Sesh). 2017 లో వచ్చిన ‘అమీ తుమీ’ నుండి చూసుకుంటే.. అతను హీరోగా చేసిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించాయి. కాబట్టి.. అతను కంటెంట్ పై ఎంతలా ఫోకస్ చేస్తాడు అనేది అర్థం చేసుకోవచ్చు. అయితే అడివి శేష్ నుండి సినిమా వచ్చి 2 ఏళ్ళు కావస్తోంది. 2022 లో ‘మేజర్’ (Major) ‘హిట్ 2′(హిట్ : ది సెకండ్ కేస్) (HIT: The Second Case) వంటి సినిమాలు అడివి శేష్ నుండి వచ్చాయి.

Adivi Sesh

ఆ రెండూ కూడా సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఎందుకో గత ఏడాది అంటే 2023 లో ఇతని నుండి సినిమాలు రాలేదు. మరోపక్క 2024 లో కూడా ఇతని సినిమా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అయితే ఈ 2 ఏళ్ళ గ్యాప్ ని.. 3 రిలీజ్..లతో మరిపిస్తాడట ఈ క్రేజీ హీరో. అవును 2025 అడివి శేష్ నుండి 3 సినిమాలు వస్తాయట. ప్రస్తుతం శేష్.. ‘గూఢచారి 2’ (Goodachari 2) సినిమాలో నటిస్తున్నాడు. ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థ ఈ చిత్రాన్ని రూ.100 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.

పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అడివి శేష్ కెరీర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ. దీంతో పాటు శృతి హాసన్ (Shruti Haasan) తో కలిసి ‘డెకాయిట్’ అనే సినిమాలో నటిస్తున్నాడు అడివి శేష్. ఇది కూడా పాన్ ఇండియా మూవీనే..! దీంతో పాటు ఓ ఓటీటీ పాజెక్టులో కూడా అడివి శేష్ నటిస్తున్నట్టు సమాచారం. అది కూడా 2025 లోనే ప్రేక్షకుల ముందుకు వస్తుందట. సో 2025 .. అడివి శేష్ కి చాలా స్పెషల్ అన్నమాట.

 బాహుబలి2 ప్రీసేల్ రికార్డ్ ను బ్రేక్ చేయడం తారక్ మూవీకి సాధ్యమా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus