Adivi Sesh: అమ్మాయిలు, ప్రపోజల్స్.. అడివి శేష్ కామెంట్స్!

సినిమా ఇండస్ట్రీలో హీరోలను పెళ్లి ఎప్పుడు అని అడిగితే సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ ఉంటారు. ఇప్పుడు అడివి శేష్ కూడా అలానే చేశారు. తన పెళ్లి గురించి ప్రశ్నిస్తే… ప్రభాస్-అనుష్కలకు ఇంకా పెళ్లిళ్లు కాలేదు కదా అని సమాధానమిచ్చారు. ఇండస్ట్రీలో పెళ్లి కావాల్సిన వాళ్లు చాలా మంది ఉన్నారని.. వాళ్ల పెళ్లిళ్లు అయ్యాక చూద్దామని అన్నారు. ‘నా ఫ్రెండ్ అనుష్క ఉంది. ఇంకా పెళ్లి చేసుకోలేదు. రానాకు పెళ్లి అయిపోయింది కానీ, ప్రభాస్ కు ఇంకా అవ్వలేదు.

వాళ్ల పెళ్లిళ్లు అయిన తర్వాత నేను పెళ్లి చేసుకుంటా’ అని తన పెళ్లి విషయాన్ని సైడ్ చేసేశారు. అయితే లవ్ ప్రపోజల్స్ మాత్రం చాలానే వచ్చాయని తెలిపారు. తనకు ప్రపోజ్ చేసిన వాళ్లలో పెళ్లైన మహిళలు కూడా ఉన్నారని చెబుతున్నారు అడివి శేష్. ‘చాలా లవ్ ప్రపోజల్స్ వచ్చాయి. కొన్ని సార్లు పెళ్లయిన వాళ్లు కూడా వచ్చి ప్రపోజ్ చేశారు. భర్తను వదిలేస్తా, పెళ్లి చేసుకో అన్నారు. ఇప్పటివరకు ఏ ప్రపోజల్ ఒప్పుకోలేదు.

పెళ్లి చేసుకోమని మా అమ్మ రోజూ సతాయిస్తోంది. చివరికి ఏ స్థాయికి వచ్చారంటే, అమ్మాయైతే చాలు పెళ్లి చేసుకో అంటున్నారు. కొరియన్ అమ్మాయి అయినా ఓకే అనే స్టేజ్ కు వచ్చేశారు. కానీ నాకే ఎవ్వరూ సెట్ అవ్వడం లేదు’ అంటూ చెప్పుకొచ్చారు.

zప్రస్తుతం అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది పూర్తి కాగానే ‘గూఢచారి2’ సినిమాను మొదలుపెడతారు శేష్. ప్రస్తుతం ‘గూఢచారి 2’ కథపై వర్క్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు అడివి శేష్.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus