Adivi Sesh: ఒక్కో ఫ్యామిలీలో పది మంది హీరోలున్నారు.. శేష్ మాటలు విన్నారా..?

టాలెంటెడ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న అడివి శేష్ ఇప్పుడు టాలీవుడ్ పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇండస్ట్రీలో బంధుప్రీతి చాలా ఎక్కువ ఉందని.. అందుకే సినిమాల్లో మెయిన్ రోల్స్ చేయడానికి బయట వ్యక్తులను ఆడిషన్స్ కి పిలిచే సాహసం చేయడం లేదని అడివి శేష్ తెలిపారు. బాలీవుడ్ మీడియా పోర్టల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విధమైన కామెంట్స్ చేశారు. టాలీవుడ్ లో లీడ్ రోల్ కి ఆడిషన్స్ అనే సంస్కృతి లేదని..

ఆల్రెడీ హీరో ఫిక్స్ అయిపోయి ఉంటాడని అన్నారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లను నేరుగా లీడ్ రోల్స్ కి సెలెక్ట్ చేసుకుంటున్నారని అన్నారు. మెయిన్ రోల్ తో పాటు కీలక పాత్రల కోసం కూడా ఆడిషన్స్ జరగవని.. కేవలం హీరో పక్కన ఉండే వారి కోసమే ఆడిషన్స్ జరుగుతాయని చెప్పారు. ఒక్కో ఫ్యామిలీలో పది మందికి పైగా హీరోలు ఉన్నారని..

అందుకే బయటివారికి మంచి అవకాశాలు రావడం లేదని అన్నారు. మంచి కథలన్నీ ఫస్ట్ వాళ్ల దగ్గరికే వెళ్తాయని.. వారిని దాటుకొని రావాలంటే మన నెంబర్ ఎక్కడో ఉంటుందని అన్నారు. ఈ పద్దతిని మార్చాలనే స్క్రిప్ట్ రాసుకోవడం మొదలుపెట్టానని తెలిపారు. తను నటించిన ఆరు సినిమాల్లో నాలుగు సినిమాలకు సొంతంగా స్క్రిప్ట్ రాసుకున్నానని అన్నారు. తనకేదో అన్నీ తెలుసని కాదని..

స్క్రిప్ట్ రాసుకోవడం వల్ల ఎక్కడైనా తప్పు జరిగితే తనకు తెలుస్తుందని అన్నారు. రీసెంట్ గా ఈ హీరో ‘హిట్ 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను నాని నిర్మించారు. ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ అధికారిగా తన పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఈ హీరో కొన్ని స్క్రిప్ట్స్ మీద వర్క్ చేస్తున్నారు.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus