Avatar 2: ఇండియా వైడ్ ‘అవతార్2’ అడ్వాన్స్ బుకింగ్స్ జాతర..మాస్ ఊర మాస్!

  • December 6, 2022 / 08:09 PM IST

ఈ మధ్య కాలంలో ఓ సినిమాకి హిట్ టాక్ వస్తే కానీ జనాలు థియేటర్లకు రావడం లేదు. కంటెంట్ బాగుంటేనే జనాలు థియేటర్ కు వస్తున్నారు అని అంతా అంటున్నారు. కానీ అందులో నిజం లేదు. ప్రమోషనల్ కంటెంట్ అనేది జనాలను అట్రాక్ట్ చేస్తేనే.. వాళ్ళు థియేటర్ కు వస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్లో రూపొందే సినిమాలకు ఆటోమేటిక్ గా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. కానీ టాక్ బాగుంటేనే అవి నిలబడుతున్నాయి.

లేదంటే వీకెండ్ కే దుకాణం సర్దేస్తున్నాయి. ఇక మన తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి ఎదిగినా.. మన తెలుగు జనాలకు మాత్రం హాలీవుడ్ సినిమాల పై మక్కువ ఏమాత్రం తగ్గలేదు. ఈ విషయాన్ని ఆల్రెడీ అవెంజర్స్ వంటి సినిమాలు ప్రూవ్ చేశాయి. అయితే ఈ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకున్న తరుణంలో ‘అవతార్2’ మళ్ళీ విజృంభిస్తుంది. అవును ‘అవతార్’ సినిమా రిలీజ్ కాకుండానే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో రూ.100 కోట్లకు పైగా వసూళ్ళను కొల్లగొట్టిందనేది ట్రేడ్ పండితుల సమాచారం.

జేమ్స్ కేమరూన్ రూపొందించిన ‘అవతార్’ మూవీ 2009లో రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ‘అవతార్2’ పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఓపెన్ అవ్వగా ఆల్రెడీ 40 శాతం బుకింగ్స్ జరిగినట్లు వినికిడి. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ఇదే జోరుని చూపిస్తూ ఆల్రెడీ రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేసినట్టు సమాచారం.

ఇప్పటివరకు ఇండియాలో ‘అవతార్ 2’ కి సంబంధించి ఇంగ్లీష్ 3డీ వెర్షన్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు 50363 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇక ఐమాక్స్ వెర్షన్ 3డీ చిత్రానికి 10643 టికెట్లు, అవతార్ 4డీ ఎక్స్ 3డీ 4708 టికెట్లు, హిందీ వెర్షన్ 6526 టికెట్లు అమ్ముడుపోయాయి. ఇండియా వ్యాప్తంగా మొత్తం 72240 టికెట్లు అమ్ముడుపోయాయని సమాచారం.పక్క దేశాల్లోని ప్రధాన నగరాల్లో కూడా అవతార్ ఇదే జోరు చూపిస్తున్నట్టు సమాచారం.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus