Akhanda 2: ‘అఖండ 2’ ఎన్నో అడ్వాంటేజులు.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ రికార్డుని బ్రేక్ చేస్తుందా?

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’. 2021 డిసెంబర్లో ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. పెద్ద సినిమాలు రిలీజ్ చేయడానికి మేకర్స్ భయపడుతున్న టైం అది. టికెట్ రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అయినప్పటికీ ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులంతా థియేటర్ కి వచ్చి సినిమాని వీక్షించారు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ చాలా రిస్క్ చేసి రిలీజ్ చేసిన ఈ సినిమా వారికి నష్టాలు రాకుండా లాభపడేలా చేసింది. బాలకృష్ణ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

Akhanda 2 Movie

దీనికి సీక్వెల్ గా ఇప్పుడు ‘అఖండ 2’ రూపొందింది. దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. డిసెంబర్ 5న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. డిసెంబర్ 4 నైట్ నుండి ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. అంతేకాదు ‘అఖండ’ కి లేని అడ్వాంటేజ్..లు ఎన్నో ‘అఖండ 2’ కి లభించాయి. టికెట్ రేట్లు కూడా పెంచారు. ప్రీమియర్ షోలకు ఏకంగా రూ.600 టికెట్ రేట్ పెడుతూ జీవోలు పాస్ చేయనున్నారు. అన్నిటికీ మించి సోలో రిలీజ్ అడ్వాంటేజ్ కూడా ఉంది. ఈ క్రమంలో ‘అఖండ 2’ పై రికార్డుల భారం కూడా ఎక్కువగానే ఉంది.

సీనియర్ స్టార్ హీరోల్లో ఇప్పటివరకు ఓపెనింగ్ డే రికార్డ్ అంటే మెగాస్టార్ చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’నే..! ఆ సినిమా రికార్డులను బాలయ్య ‘అఖండ 2’ బ్రేక్ చేయాలి. అలాగే చిరంజీవి కెరీర్లో రూ.100 కోట్ల షేర్ మూవీ ఉంది. కానీ బాలయ్యకి ఒక్కటి కూడా లేదు. ‘అఖండ 2’ తో బాలయ్య రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరాలి. అలాగే 2025 కి బిగ్గెస్ట్ హిట్ అంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే చెప్పాలి. ఆ సినిమా వసూళ్లను ‘అఖండ 2’ అధిగమించవలసిన అవసరం ఉంది. మరి ఈ రికార్డులన్నింటినీ బ్రేక్ చేసి బాలయ్య.. చరిత్ర సృష్టిస్తాడో లేదో అనేది తెలియాలి.

 ‘కాంతార’ పై రణ్వీర్ సింగ్ వెటకారపు కామెంట్లు.. రిషబ్ శెట్టిని టార్గెట్ చేస్తూ..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus