Balakrishna: ఆ స్టార్ డైరెక్టర్ బాలయ్యను ఏకంగా ఇంతలా అభిమానిస్తారా?

టాలీవుడ్ స్టార్ హీరో బాలయ్యతో (Nandamuri Balakrishna) ఒకసారి సినిమా తీసిన దర్శకులు ఆయనతో మళ్లీమళ్లీ పని చేయాలని ఆసక్తి చూపుతారు. బాలయ్య పూరీ జగ్ననాథ్ (Puri Jagannadh) కాంబినేషన్ లో తెరకెక్కిన పైసా వసూల్ (Paisa Vasool) సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా బాలయ్య అభిమానులకు మాత్రం ఈ సినిమా ఎంతగానో నచ్చింది. ఈ సినిమాలో పూరీ జగన్నాథ్ మార్క్ డైలాగ్స్ మాత్రం భలే పేలాయి. అయితే బాలయ్యను బాలా అని ప్రేమగా పిలిచే ఏకైక దర్శకుడు పూరీ జగన్నాథ్ అని సమాచారం.

తనను బాలా అని పిలిస్తే ఎంతో ఇష్టమని బాలయ్య సైతం పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. పైసా వసూల్ ఆశించిన ఫలితాన్ని అందుకోకపోయినా పూరీ జగన్నాథ్ మరో మంచి కథతో వస్తే ఆయన డైరెక్షన్ లో నటించడానికి బాలయ్య సిద్ధంగా ఉన్నారు. జయాపజయాలను పట్టించుకోకుండా బాలయ్య ఛాన్స్ ఇస్తారు. పూరీ సైతం బాలయ్యను ఎంతో అభిమానిస్తారని తెలుస్తోంది. డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) రిలీజ్ తర్వాత బాలయ్య పూరీ జగన్నాథ్ కాంబినేషన్ రిపీట్ అవుతుందేమో చూడాల్సి ఉంది.

పూరీ జగన్నాథ్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లన్నీ ఒకింత భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలుగా పూరీ జగన్నాథ్ సినిమాలు విడుదల అవుతుండటం గమనార్హం. పూరీ జగన్నాథ్ తన సినిమాలకు తనే నిర్మాతగా వ్యవహరిస్తూ విజయాలను సొంతం చేసుకుంటున్నారు. బాలయ్య విషయానికి వస్తే పొలిటికల్ ప్రచారంతో బిజీగా ఉన్న ఈ హీరో ఎన్నికలు పూర్తైన తర్వాతే బాబీ (K. S. Ravindra) మూవీతో బిజీ కానున్నారు.

బాలయ్య బాబీ కాంబో మూవీకి సంబంధించి ఇప్పట్లో అప్ డేట్స్ వచ్చే ఛాన్స్ అయితే లేదని తెలుస్తోంది. 30 కోట్ల రూపాయల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్న బాలయ్య వరుసగా క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తూ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. బాలయ్య భవిష్యత్తు సినిమాలు ఇతర భాషల్లో సైతం రిలీజ్ కానున్న నేపథ్యంలో బాలయ్యకు భారీ పాన్ ఇండియా హిట్ దక్కుతుందేమో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus