బాలీవుడ్ సినీ ప్రముఖులు తెలుగు సినిమాని.. ప్రేక్షకులను అప్పట్లో చాలా తక్కువగా చూసేవారు. చెప్పాలంటే చరిత్ర సృష్టించిన ‘బాహుబలి'(సిరీస్) ని అక్కడి సెలబ్రిటీలు ‘సౌత్ సినిమా’ అంటారు తప్ప.. అది ‘తెలుగు సినిమా’ అని చెప్పడానికి.. ఒప్పుకోవడానికి… చాలా నామోషీగా ఫీలవుతుంటారు. అయితే ఇప్పుడు అక్కడ కథలు దొరక్క.. మన తెలుగు సినిమాలనే రీమేక్ చేసుకుంటున్నారు. మన తెలుగు సినిమాల హిందీ వెర్షన్లకు యూట్యూబ్లో 100 మిలియన్ల పైనే వ్యూస్ వస్తున్నాయి.
అవే సినిమాలను అక్కడి ఛానెల్స్ లో టెలికాస్ట్ చేస్తే రికార్డు టి.ఆర్.పి రేటింగ్ లు నమోదవుతున్నాయి. బహుశా.. అందుకేనేమో మన తెలుగు సినిమాలనే ఎక్కువగా రీమేక్ చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అక్కడి మేకర్స్. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’ చిత్రాన్ని ‘కభీర్ సింగ్’ గా రీమేక్ చెయ్యగా అక్కడ పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. తెలుగులో డైరెక్ట్ చేసిన సందీప్ రెడ్డి వంగానే ‘కభీర్ సింగ్’ రీమేక్ ను కూడా డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ‘జెర్సీ’ ‘ఎఫ్2’ చిత్రాలు కూడా రీమేక్ కాబోతున్నాయి. ‘జెర్సీ’ ని తెలుగులో డైరెక్ట్ చేసిన గౌతమ్ తిన్ననూరినే ఆ రీమేక్ ను తెరకెక్కిస్తున్నాడు.
ఇదిలా ఉండగా.. 12 ఏళ్ళ క్రితం వచ్చిన ‘వినాయకుడు’ చిత్రాన్ని కూడా రీమేక్ చేయబోతున్నారట. కృష్ణుడు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అడివి శేష్ అన్నయ్య అయిన సాయి కిరణ్ అడివి డైరెక్ట్ చేసాడు. బాలీవుడ్లో కూడా అతనే రీమేక్ చేయబోతున్నాడట. మరి కృష్ణుడు పోషించిన ఆ పాత్రని బాలీవుడ్లో ఎవరు చేస్తారు అనేది ఆసక్తిని రేకెత్తించే అంశం.
Most Recommended Video
గుంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!
రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?