Aamir Khan Divorce: ఆమిర్ ఈ విషయంలో కూడా మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నాడు..!

బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ ను అందరూ మిస్టర్ పర్ఫెక్ట్ అని అంటుంటారు. ఎందుకంటే సినిమాలో తన పాత్రకోసం ఎంతైనా కష్టపడుతుంటాడు. తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆమిర్ కు అభిమానులు ఉన్నారు. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే అమీర్ ఖాన్ మరోసారి విడాకులు తీసుకోబోతుండడం.. చర్చనీయాంశం అయ్యింది. గత నాలుగైదు రోజులుగా ఇదే హాట్ టాపిక్ గా నిలుస్తుంది. దీంతో ఆమిర్ పై గా కొంత మేర ట్రోలింగ్ కూడా నడుస్తుంది.

అయితే ఈ విషయం పై ఇద్దరూ పాజిటివ్ గానే స్పందిస్తున్నారు. స్నేహపూర్వకంగానే విడిపోవాలని నిశ్చయించుకున్నామని.. విడిపోయినా ఒకరికొకరం తోడుగానే ఉంటామని వీరు చెప్పుకొస్తున్నారు. ఇదిలా ఉండగా… విడాకుల విషయంలో కూడా ఆమిర్.. మిస్టర్ పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకున్నట్టు కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆమిర్ మొదటి భార్య రీనా దత్తతో 15 ఏళ్ళు కాపురం చేసి విడాకులు ఇచ్చాడు. వీళ్ళ వివాహం 1986 వ సంవత్సరంలో జరుగగా..

తర్వాత 2002 లో విడిపోయారు.ఇక రెండో భార్య కిరణ్ రావుతో కూడా 15ఏళ్ళే కాపురం చేసాడు ఆమిర్. 2005లో కిరణ్ రావ్ ను పెళ్లి చేసుకున్న ఆమిర్ ఖాన్.. 2021 లో విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఏమైనా చాలా కాల్యుక్యులేటివ్ గా ఇతను మ్యారేజ్ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. మరోపక్క ఆమిర్ 3వ పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus