Chiranjeevi, Keeravani: ఈ టైంలో కీరవాణికి ఇది బంపర్ ఆఫరే..!

మెగాస్టార్ చిరంజీవి – యం.యం.కీర‌వాణిల‌ది సూపర్ హిట్ కాంబినేషనే. ఘ‌రానామొగుడు, ఆపద్బాంధవుడు, ఎస్.పి.పరశురామ్ వంటి సినిమాలు ఈ కాంబినేషన్లో వచ్చాయి. ‘ఘరానా మొగుడు’ ఇండస్ట్రీ హిట్ అయ్యింది.. కానీ మిగిలిన రెండు ఆడలేదు. కానీ ఈ మూడు సినిమాల్లోనూ పాటలు అదిరిపోతాయి. అన్నీ చార్ట్ బస్టర్ సాంగ్స్ అనే చెప్పాలి. కానీ ఈ కాంబోలో తర్వాత ఏ సినిమా రాలేదు. చిరు రాఘవేంద్రరావు దర్శకత్వంలో చేసే సినిమాలకి కూడా వేరే సంగీత దర్శకులను ఎంపిక చేసుకున్నారు.

ఎక్కువగా మ‌ణిశ‌ర్మ‌, దేవీశ్రీ ప్ర‌సాద్, ఇప్పుడు త‌మ‌న్‌… వంటి సంగీత దర్శకులతోనే చిరు సినిమాలు చేస్తున్నారు. మహతి సాగర్ కి కూడా చిరు ఛాన్స్ ఇచ్చారు. ఎందుకో చిరు – కీరవాణి ల కాంబోకి గ్యాప్ వచ్చింది. అది కూడా ఏకంగా 28 ఏళ్ళ గ్యాప్ అని చెప్పాలి. అయితే ఇంతకాలానికి ఈ కాంబోలో మళ్ళీ సాంగ్స్ వినే అవకాశం ఉందట.విషయం ఏంటంటే.. చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వ‌శిష్ట ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం రానుంది. దీనికి కీర‌వాణి సంగీతం అందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట.

బింబిసార విజ‌యంలో.. కీర‌వాణి పాత్ర చాలానే ఉంది. ఆ చిత్రానికి పాటలు చిరంతన్ భట్ అందించినప్పటికీ.. `అడ‌గాలే కానీ..` అనే పాట చిత్రవిజయంలో కీలక పాత్ర పోషించింది. ఇది కీరవాణి సంగీతంలో రూపొందిన పాట. అందుకే ఈసారి వశిష్ట్.. కీరవాణికే ఓటేసినట్టు తెలుస్తుంది. ఇది కూడా సోసియో ఫాంటసీ మూవీనే..! `ముల్లోక వీరుడు` అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయి. చిరు (Chiranjeevi) పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నారు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus