5 ఏళ్ళ తరువాత విడుదల..కానీ వివాదాలు వెంటాడుతున్న వేళ..!

నిజానికి ‘నేను శైలజ’ కీర్తి సురేష్ మొదటి సినిమా కాదు. ‘ఐనా ఇష్టం’ నువ్వు అనే చిత్రం కీర్తి సురేష్ మొదటి సినిమా..! ‘ఫ్రెండ్లీ మూవీస్’ బ్యానర్ పై అడ్డాల చంటి ఈ చిత్రాన్ని నిర్మించాడు. రాంప్రసాద్ రగటు డైరెక్టర్. నిజానికి 2015 లేదా 2016లో విడుదలవ్వాల్సిన ఈ చిత్రం.. షూటింగ్ చివరి దశలో ఉండగా కొన్ని ఆర్ధిక సమస్యల వచ్చి ఆగిపోయింది. అప్పటి నుండీ ఈ చిత్రం విడుదల కాలేదు. ఇప్పుడు కీర్తి సురేష్ పెద్ద స్టార్ అయ్యింది కాబట్టి.. ఈ చిత్రాన్ని ఓటిటిలో అయినా విడుదల చేస్తే క్యాష్ చేసుకోవచ్చు అని నిర్మాత ప్లాన్ చేసాడు.

కొంత షూటింగ్ బ్యాలన్స్ ఉన్నప్పటికీ కీర్తి సురేష్ కాల్షీట్లు ఇవ్వడానికి రెడీ అయ్యింది. కరోనా విజృంభిస్తున్న తరుణంలో కూడా నిర్మాత బాగు కోరి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు కీర్తి సురేష్ ను అభినందించాల్సిందే. అయితే ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ చిత్రం నిర్మాత అడ్డాల చంటి పై చిన్న సినిమాల నిర్మాత నట్టి కుమార్ వివాదాస్పద కామెంట్లు చెయ్యడం సంచలనంగా మారింది.’ ‘ఐనా ఇష్టం నువ్వు’ సినిమా హక్కులని నిర్మాత చంటి దగ్గర నుండీ నేను ఎప్పుడో కొనుగోలు చేశాను. దానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా నా దగ్గర ఉన్నాయి. ఈ చిత్రం నాది.నాకే ఈ చిత్రం పై సర్వ హక్కులు ఉన్నాయి.

అలాంటిది ఇప్పుడు చంటి విడుదల చేస్తాననడం ఏంటి?’ అంటూ ప్రశ్నిస్తున్నాడు.దీనికి నిర్మాత చంటి ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. ఇలా నిర్మాతల మధ్య వివాదాస్పద వాతావరణం నెలకొన్న తరుణంలో కీర్తి సురేష్ ఈ చిత్రం బ్యాలన్స్ షూటింగ్ ను ఫినిష్ చేస్తాను అని మాట ఇచ్చి తప్పు చేసిందా? ఇలాంటి వివాదాల సినిమా ఆమె కెరీర్ ను దెబ్బ తీసే ఛాన్స్ ఉందా? ప్రస్తుతం ఇలాంటి సందేహాలే వెల్లడవుతున్నాయి.

Most Recommended Video

బిగ్‌బాస్ 4: ఆ ఒక్క కంటెస్టెంట్ కే.. ఎపిసోడ్ కు లక్ష ఇస్తున్నారట..!
గంగవ్వ గురించి మనకు తెలియని నిజాలు..!
హీరోలే కాదు ఈ టెక్నీషియన్లు కూడా బ్యాక్ – గ్రౌండ్ తో ఎంట్రీ ఇచ్చినవాళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus