ఫ్యామిలీ, సెంటిమెంట్ చిత్రాలతో తన కంటూ ఓ పేజీ లిఖించుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్, కొరియోగ్రఫీ ఇలా 24 క్రాఫ్ట్స్‌పై పట్టున్న అతికొద్దిమంది దర్శకుల్లో ఆయన కూడా ఒకరు. ముఖ్యంగా కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలూ వీనుల విందుగా ఉండి, ఆయన చిత్రాలను మ్యూజికల్ హిట్స్ గా మార్చేశాయి. అయితే యువ దర్శకులు రాకతో కృష్ణారెడ్డి స్పీడ్ తగ్గింది. తర్వాత నెమ్మదిగా ఆయన వెండితెరకు దూరమవుతూ వచ్చారు. 2012లో ‘డైవర్స్ ఇన్విటేషన్’ పేరుతో ఓ ఆంగ్ల చిత్రాన్నీ డైరెక్ట్ చేశారు.
చివరగా ఆయన 2014లో ‘యమలీల-2’ చిత్రాన్ని తెరకెక్కించారు ఎస్వీ కృష్ణారెడ్డి. అయితే ఇటీవలి కాలంలో కొందరు సీనియర్ దర్శకులు షార్ట్ ఫిల్మ్స్, డాక్యుమెంటరీలు, వెబ్ సిరీస్‌ల్లోకి అడుగుపెడుతుండటంతో ఆయన కూడా తిరిగి రీ ఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. ఇప్పటికీ ఫ్యామిలీ మొత్తం చూడదగ్గ చక్కని చిత్రాలను నిర్మించాలన్నదే కృష్ణారెడ్డి కోరిక కూడా. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు మొదలైనట్లే తెలుస్తోంది. అయితే… పూర్తి స్థాయిలో అన్ని రెడీ కాకుండా ప్రాజెక్ట్స్ ను ప్రకటించడం సబబు కాదంటారు కృష్ణారెడ్డి.
ఇటీవల ఆయన పర్యవేక్షణలోనే స్టార్ కమెడీయన్ అలి ప్రధాన పాత్రధారిగా ‘యమలీల… ఆ తర్వాత’ పేరుతో ఓ ప్రముఖ టీవీలో సీరియల్ మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఎస్వీ కృష్ణారెడ్డి కన్ను మాత్రం సినిమాపైనే వుంది. లాక్‌డౌన్ సమయంలో ఆయన కొన్ని కథలు సిద్ధం చేసుకున్నారట.వీటిలో కొన్నింటికీ ఇప్పటికే నిర్మాతలు కూడా ఒకే చేశారని.. త్వరలోనే నటీనటుల ఎంపిక చేపట్టి సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట ఎస్వీ కృష్ణారెడ్డి. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.
Most Recommended Video
మహేష్ టు నవీన్… ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన హీరోల లిస్ట్..!
పవర్ ఆఫ్ పబ్లిక్ సర్వెంట్ అంటే చూపించిన 11 మంది టాలీవుడ్ స్టార్లు..!
అఘోరా గెటప్ టాలీవుడ్ హీరోలకు కలిసొచ్చిందా!