తొమ్మిది నెలల తర్వాత కెమెరా ముందుకు వచ్చిన ఎన్టీఆర్
- March 15, 2017 / 09:15 AM ISTByFilmy Focus
ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ 27 సినిమా, గత నెల 20 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఆ చిత్రీకరణలో ఎన్టీఆర్ పాల్గొనలేదు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు పోషించనున్నారు. ఆ క్యారెక్టర్స్ లుక్ కోసం కొన్నిరోజులుగా శ్రమిస్తున్నారు. రీసెంట్ గా ఒక పాత్ర లుక్ ఫైనల్ కావడంతో నేడు (బుధవారం) షూటింగ్ లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ఆర్ట్స్ వారు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ లుక్ ని చూడాలని ఆశపడుతున్న వారికి నిరాశే ఎదురైంది. అతని ఫోటోని రివీల్ చేయలేదు.
డైరక్టర్ బాబీ, కెమెరామెన్ సీ కే మురళీధరన్ షాట్ గురించి చర్చించుకుంటున్న ఫోటోని షేర్ చేశారు. ఏదిఏమైనా తొమ్మిది నెలల తర్వాత ఎన్టీఆర్ కెమెరా ముందుకు రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “జై లవ కుశ” అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ ఫిల్మ్ కి హాలీవుడ్ లెగసీ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ వాన్సీ హార్ట్ వెల్ ని తీసుకున్నారు. ఈయన ఎన్టీఆర్ ని సరికొత్తగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















